AP News: బెదిరించి పలుమార్లు అత్యాచారం.. విద్యార్థినిపై లెక్చరర్ అఘాయిత్యం
ABN , First Publish Date - 2023-10-11T11:05:31+05:30 IST
జిల్లాలోని మార్కాపురంలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన లెక్చరర్ చెడు దారి పట్టాడు.
ప్రకాశం: జిల్లాలోని మార్కాపురంలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన లెక్చరర్ చెడు దారి పట్టాడు. ఓ విద్యార్ధినిపై కన్నేసిన సదరు లెక్చరర్.. ఆమెను బెదిరించి మరీ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పూలసుబ్బయ్య కాలనీకి చెందిన విద్యార్థిని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. అదే కాలేజ్‌లో యర్రగొండపాలెం మండలం పాలుట్ల గ్రామానికి చెందిన గోవింద్ నాయక్ లెక్చర్‌గా పనిచేస్తున్నాడు. లెక్చరర్‌కు వివాహం జరిగి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే మార్కాపురంకు చెందిన విద్యార్థినిపై కన్నేసిన గోవింద్.. ఒకనొక సమయంలో తన ఫోన్లో విద్యార్థినిని అసభ్యకరరీతిలో ఫోటోలు తీశాడు. అనంతరం వాటిని ఇతరలకు చూపిస్తానంటూ బెదిరిస్తూ పలు మార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో విద్యార్థిని గర్భం దాల్చింది. విషయం తెలిసిన గోవింద్ అబార్షన్ చేసుకోవాలంటూ విద్యార్థినిపై దాడి కూడా చేశాడు. చికిత్స నిమిత్తం విద్యార్థిని మార్కాపురం ఏరియా హాస్పిటల్లో చేరగా.. ఆమె కడుపుపై దెబ్బలు ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. వెంటనే అబార్షన్ చేయాలని.. లేకపోతే విద్యార్థిని ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్స్ తెలిపారు. చివరకు బాధితురాలి ఫిర్యాదు మేరకు లెక్చరర్ గోవింద్ నాయక్‌పై అత్యాచారం, ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.