TTD: రూ.300 దర్శన టికెట్ల కోటా 13న విడుదల
ABN , First Publish Date - 2023-02-10T21:33:07+05:30 IST
తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి సంబంధించిన ఫిబ్రవరి నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ (TTD) 13వ తేదీన విడుదల చేయనుంది.
తిరుమల: తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి సంబంధించిన ఫిబ్రవరి నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ (TTD) 13వ తేదీన విడుదల చేయనుంది. శ్రీవారి ఆలయ ఆనంద నిలయానికి స్వర్ణతాపడం పనులు చేపట్టాలని నిర్ణయించిన టీటీడీ ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 23న బాలాలయం నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే జనవరి (January) నెలాఖరులో విడుదల చేసిన ఫిబ్రవరి నెల టికెట్ల కోటాలో 22 నుంచి 28వ తేదీ వరకు సంబంధించిన టికెట్లను టీటీడీ నిలుపుదల చేసింది. అయితే బాలాలయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసిన నేపథ్యంలో తిరిగి దర్శన టికెట్ల కోటాను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 22 నుంచి 28వ తేదీ వరకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈనెల 13వ తేదీన ఉదయం 9 గంటలకు ‘Tirupathibalaji.ap.jov.in’ అనే వెబ్‌సైట్‌తో పాటు ‘టీటీదేవస్థానమ్స్’ మొబైల్ యాప్‌లో విడుదల చేయనున్నారు. అలాగే, మార్చినెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్ల కోటాతో పాటు ఈనెల 23 నుంచి 28వ తేదీ వరకు విడుదల చేయని టోకెన్ల కోటాను కూడా టీటీడీ శనివారం ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.