Raghurama: కేంద్ర మంత్రి భేటీలో రఘురామ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-05-28T20:27:16+05:30 IST

కేంద్ర మంత్రి హర్ధీప్ సింగ్ పూరీతో ఎంపీ రఘురామ (Raghurama Krishnam Raju) భేటీ అయ్యారు.

Raghurama: కేంద్ర మంత్రి భేటీలో రఘురామ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ: కేంద్ర మంత్రి హర్ధీప్ సింగ్ పూరీతో ఎంపీ రఘురామ (Raghurama Krishnam Raju) భేటీ అయ్యారు. ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం సాయం చేయవద్దని కోరారు. హైకోర్టు తుదితీర్పు తర్వాతే ఆర్‌-5 జోన్‌లో ఇళ్లపై లబ్ధిదారులకు హక్కు ఉంటుందన్నారు. దీనిపై సుప్రీంకోర్టు తీర్పును కేంద్రమంత్రి దృష్టికి రఘురామ తీసుకెళ్లారు. అలాగే టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల పేర్లు మార్చుతున్నారని రఘురామ ఫిర్యాదు చేశారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు అందజేయలేదన్నారు. దీనిపై ఏపీ నుంచి నివేదిక కోరాలని రఘురామ విజ్ఞప్తికి కేంద్రమంత్రి అంగీకారం తెలిపారు. ఆర్‌-5 జోన్‌ ఇళ్లకు కేంద్ర సాయంపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని హర్ధీప్‌సింగ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-05-28T20:27:16+05:30 IST