Raghurama Krishnamraju : పురందేశ్వరిపై కారుకూతలు ఆపండి

ABN , First Publish Date - 2023-10-12T13:52:03+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. సమావేశంలో పురందేశ్వరి, కిషన్ రెడ్డి సైతం ఉన్నారన్నారు.

Raghurama Krishnamraju : పురందేశ్వరిపై కారుకూతలు ఆపండి

ఢిల్లీ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. సమావేశంలో పురందేశ్వరి, కిషన్ రెడ్డి సైతం ఉన్నారన్నారు. లోకేష్ హోంమంత్రిని కలవడంతో తమ పార్టీ నేతలు కలవరింపునకు గురయ్యారని ఎద్దేవా చేశారు. పురందేశ్వరి సమావేశం ఏర్పాటు చేసిందని తమ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని.. ఆమెపై కారుకూతలు ఆపాలన్నారు.

సీఎం జగన్ సైతం స్కిల్ డెవలప్మెంట్ కేసు వెనుక కేంద్రం ఉన్నట్టు ప్రచారం చేసుకున్నారని రఘురామ అన్నారు. కుట్రలో భాగంగా బీజేపీ ఉన్నట్టు మా పార్టీ నేతలు మాట్లాడారన్నారు. చంద్రబాబు నాయుడు ఏపీకి మాత్రమే సంబంధించిన వ్యక్తి కాదని.. ఒకరికి ఆపద వచ్చినప్పుడు కేంద్రంలో ఉన్నవారు జోక్యం చేసుకుంటారన్నారు. తనపై కేసు తర్వాత అమిత్ షాను తన కుటుంబ సభ్యులు కలిశారన్నారు.17ఏ చంద్రబాబుకు వర్తిసుందని.. రేపు సుప్రీంకోర్టులో న్యాయం గెలుస్తుందని రఘురామ అన్నారు.

Updated Date - 2023-10-12T13:52:03+05:30 IST