Share News

AP High Court: రాజధాని అసైన్డ్ భూముల కేసు విచారణ హైకోర్టులో వాయిదా

ABN , First Publish Date - 2023-11-10T11:47:23+05:30 IST

రాజధాని అసైన్డ్ భూముల కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

AP High Court: రాజధాని అసైన్డ్ భూముల కేసు విచారణ హైకోర్టులో వాయిదా

అమరావతి: రాజధాని అసైన్డ్ భూముల కేసు విచారణను (Rajdhani assigned land case) హైకోర్టు (AP Higg CourT) వాయిదా వేసింది. రాజధాని అసైన్ భూముల కేసును రీ ఓపెన్ చేయాలంటూ హైకోర్టులో సీఐడీ పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును మళ్లీ రీ ఓపెన్ చేయాలని సీఐడీ పిటీషన్‌లో కోరింది. సీఐడీ (CID) పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు (శుక్రవారం) విచారణకు వచ్చింది. సీఐడీ విజ్ఞప్తి మేరకు కేసు విచారణను నవంబర్ 22కు హైకోర్టు వాయిదా వేసింది.


కాగా.. రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరి 24 ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై వారు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. 2021 మార్చి 19న స్టే ఉత్తర్వులు జారీ చేసింది. స్టే ఎత్తివేయాలని సీఐడీ అనుబంధ పిటిషన్లు వేసింది. ఈ నేపథ్యంలో ప్రధాన వ్యాజ్యాలపై ఈ ఏడాది ఆగస్టులో న్యాయస్థానం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో ఆగస్టు 30న తీర్పును రిజర్వు చేసింది.

Updated Date - 2023-11-10T11:47:24+05:30 IST