AP Highcourt: ఒంగోలు టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టులో ఊరట
ABN , First Publish Date - 2023-10-03T14:10:26+05:30 IST
ఒంగోలు టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆరుగురు టీడీపీ సీనియర్ నేతలకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అమరావతి: ఒంగోలు టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టులో (AP High Court) ఊరట లభించింది. ఆరుగురు టీడీపీ సీనియర్ నేతలకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ నేతలు బంద్ పాటించారు. బంద్‌లో పాల్గొన్న తెలుగుదేశం నేతలపై పోలీసులు 307 కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసిన కేసుపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం టీడీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో విచారణకు రాగా.. బాధితులు తరుపు న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతో బాధితులపై పోలీసులు కేసు నమోదు చేశారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. వైసీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్రమ కేసులు నమోదు చేశారని న్యాయస్థానం దృష్టికి లక్ష్మీ నారాయణ తీసుకొచ్చారు. చేతితో కొడితే 307 సెక్షన్ ఎలా వర్తిస్తుందన్న పిటిషనర్ తరుపు న్యాయవాది ప్రశ్నించారు. న్యాయవాది లక్ష్మీనారాయణ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఆరుగురు టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టుల ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.