Sajjala Ramakrishna Reddy : అవినాష్ టైం అడిగాడు.. ఇస్తే ఏమవుతుంది?
ABN , First Publish Date - 2023-05-23T14:01:06+05:30 IST
2019 ఇదే రోజు ఎన్నికల ఫలితాలు వచ్చాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మే 30 న జగన్ ప్రమాణం చేశారన్నారు. మేనిఫెస్టోను 98.5 శాతం అమలు చేశారన్నారు. ఈ నాలుగు ఏళ్లలో ఈ రాష్ట్రంలో జగన్ మంచి పాలనను అందచేశారన్నారు. ఒక పక్క పాలన వికేంద్రకరణకు సైతం కృషి చేశారన్నారు. అవినీతికి వ్యతరేకంగా పేదలకు అనుకూలంగా పాలన సాగుతోందన్నారు.
తాడేపల్లి : 2019 ఇదే రోజు ఎన్నికల ఫలితాలు వచ్చాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మే 30 న జగన్ ప్రమాణం చేశారన్నారు. మేనిఫెస్టోను 98.5 శాతం అమలు చేశారన్నారు. ఈ నాలుగు ఏళ్లలో ఈ రాష్ట్రంలో జగన్ మంచి పాలనను అందచేశారన్నారు. ఒక పక్క పాలన వికేంద్రకరణకు సైతం కృషి చేశారన్నారు. అవినీతికి వ్యతరేకంగా పేదలకు అనుకూలంగా పాలన సాగుతోందన్నారు. 4 ఏళ్ల లో 4 పోర్ట్‌లను అభివృద్ధి చేశారన్నారు. డెవలప్ మెంట్ అంటే చిన్న ఫ్యాక్టరీ లు 4, 5 పెట్టడం గొప్ప కాదని సజ్జల తెలిపారు. పాలన వికేంద్రీకరణ ద్వారా 3 రాజధానులతో కోర్టు వివాదాలు దాటితే ఆదర్శమైన పాలన ప్రారంభం అవుతుందన్నారు. 2019 కన్నా మించిన విజయం ప్రజలు రానున్న రోజుల్లో అందించాలని కోరారు.
అవినాష్ అరెస్ట్ వ్యవహారంపై సజ్జల మాట్లాడుతూ..
‘‘అవినాష్ తన తల్లికి బాలేదు అని చెప్పారు. సీబీఐ అరెస్ట్ చేస్తామంటే ఎస్పీ సహకరించలేదు అని ఎవరు చెప్పారు? మీడియా క్రియేట్ చేసిన తుఫాను దెబ్బకు అక్కడకు పార్టీ, అయన అభిమానులు ఏంటి ఈ అన్యాయం అని వస్తారు. డిబెట్లలో రాష్ట్రపతి పాలన విధించాలని ఒకాయన అంటారు. ఎవరైనా కాస్త ఆవేశానికి లోనైతే మీడియా మీద దాడి అంటున్నారు. ఎవరైతే కరుడు గట్టిన వారు వుంటారో వాళ్ళుకు చెప్పకుండానే అవేశం వస్తుంది. సీబీఐ, రాష్ట్ర పోలీస్‌లను అవినాష్ అరెస్ట్ కోసం సాయం చేయమని అడిగారా? అది డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ మధ్య జరుగుతుందనేది మనకు ఎలా తెలుస్తుంది? అవినాష్ టైం అడిగాడు ఇస్తే ఏమవుతుంది? టైం తీసుకొని అప్పటికి రాకపోతే అరెస్ట్ చేస్తారు. హైదరాబాద్, బెంగళూర్‌కు ఎందుకు అవినాష్ తల్లిని తీసుకు వెళ్ళలేదు అంటారు. కర్నూల్ ఎందుకు తీసుకువచ్చారని అడుగుతారు. గవర్నమెంట్‌కి అవినాష్ వ్యవహారానికి సంబంధం లేదు’’ అని తెలిపారు.