Andhra Pradesh : రోజురోజుకు వేడెక్కుతున్న ఏపీలో సర్పంచ్‌ల ఉద్యమం..

ABN , First Publish Date - 2023-07-18T07:45:20+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్‌ల ఉద్యమం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఏపీ వ్యాప్తంగా సోమవారం నిరసనలు చేపట్టి.. తమ పంచాయతీల్లో దొంగలు పడ్డారంటూ పెద్దఎత్తున సర్పంచులు ఫిర్యాదులు చేశారు. రూ.8,660 కోట్ల నిధులు దొంగలించారని సైబర్‌ క్రైం కేసు కట్టి, దొంగలను పట్టుకోవాలని ఏపీ పంచాయతీ ఛాంబర్‌ ఆందోళన చేపట్టింది..

Andhra Pradesh : రోజురోజుకు వేడెక్కుతున్న ఏపీలో సర్పంచ్‌ల ఉద్యమం..

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్‌ల ఉద్యమం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఏపీ వ్యాప్తంగా సోమవారం నిరసనలు చేపట్టి.. తమ పంచాయతీల్లో దొంగలు పడ్డారంటూ పెద్దఎత్తున సర్పంచులు ఫిర్యాదులు చేశారు. రూ.8,660 కోట్ల నిధులు దొంగలించారని సైబర్‌ క్రైం కేసు కట్టి, దొంగలను పట్టుకోవాలని ఏపీ పంచాయతీ ఛాంబర్‌ ఆందోళన చేపట్టింది. తమ డబ్బు ఇప్పించండంటూ ఎక్కడికక్కడ విజ్జప్తులు చేశారు. చాలా చోట్ల ప్రభుత్వంపై పోలీసులకు సర్పంచ్‌ల ఫిర్యాదులు చేయడం జరిగింది. నెలాఖరులోగా సమస్య పరిష్కరించకపోతే ఆమరణ దీక్షలు చేస్తామని సర్పంచ్‌లు ఒకింత హెచ్చరించారు.


Sarpanch-Udyamam.jpg

వెంటనే జమ చేయండి..!

ఈ సందర్భంగా ఏపీ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పాపారావు మీడియాతో మాట్లాడుతూ.. తాడేపల్లిలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ సూర్యకుమారికి వినతిపత్రం ఇచ్చామన్నారు. ఆర్థిక సంఘం నిధులు విడుదలై 50 రోజులవుతున్నా ఇంతవరకు పంచాయతీలకు జమకాకపోవడం దారుణమన్నారు. వెంటనే నిధులు పీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాల్లో జమచేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.988 కోట్లకు.. ప్రతిపాదనలు పంపాలని కమిషనర్కు విజ్జప్తి చేశామని పాపారావు తెలిపారు.

కాగా.. గ్రామీణ ప్రజల తరపున, గ్రామాల గుండె చప్పుడు కోసం సర్పంచ్‌లు ఉన్నారు. గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి సర్పంచ్‌లను కేవలం ఉత్సవ విగ్రహాలుగా మార్చిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2023-07-18T07:47:06+05:30 IST