Erra Gangireddy: సుప్రీం కోర్టులో ఎర్ర‌గంగిరెడ్డికి షాక్

ABN , First Publish Date - 2023-05-26T13:43:46+05:30 IST

న్యూఢిల్లీ: వైఎస్ వివేకానందరెడ్డి హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. జులై 1వ తేదీన ఎర్ర‌గంగిరెడ్డికి బెయిల్ మంజూరీ చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై ధర్మాసనం స్టే ఇచ్చింది.

Erra Gangireddy: సుప్రీం కోర్టులో ఎర్ర‌గంగిరెడ్డికి షాక్

న్యూఢిల్లీ: వైఎస్ వివేకానందరెడ్డి హ‌త్య కేసు (Viveka Murder Case)లో ప్ర‌ధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి (Erra Gangireddy)కి సుప్రీం కోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. జులై 1వ తేదీన ఎర్ర‌గంగిరెడ్డికి బెయిల్ (Bail) మంజూరీ చేయాలంటూ హైకోర్టు (High Court) ఇచ్చిన ఆదేశాల‌పై ధర్మాసనం స్టే (Stay)ఇచ్చింది.

కాగా గంగిరెడ్డి బెయిల్ కేసుపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ ప్రారంభమైంది. వివేకా హత్య కేసులో ఏ1 (A1) నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దు చేస్తూ... తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై న్యాయస్థానం విచారణ జరిపింది. జులై 1 తరువాత బెయిల్ ఇవ్వాలని హై కోర్టు ఇచ్చిన తీర్పు ఎనిమిదో వింత లాగా ఉందని గత విచారణ సందర్భంగా సీబీఐ తరపున హాజరైన అడిష‌న‌ల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్‌ సంజయ్ జైన్ అన్నారు. కాగా గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దు చేసిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో వైఎస్ వివేకా కుమార్తె సునీతా పిటిషన్ దాఖలు చేశారు.

జూన్ 30వ తేదీలోపు దర్యాప్తు ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఆ మరుసటి రోజు జులై 1న గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని ట్ర‌య‌ల్ కోర్టును హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. జులై 1న ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని ట్రయిల్ కోర్టును ఆదేశిస్తూ... బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. అలాగే జులై 1న బెయిల్ ఇవ్వాలని షరతు విధిస్తూ... హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన వివేక కుమార్తె సునీత... సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. గంగిరెడ్డి బెయిల్ రద్దు షరతులపై గతంలో విచారణ సందర్భంగా సీజేఐ ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేసింది. బెయిల్‌ను రద్దుచేసి మళ్లీ ఫలానా రోజున విడుదల చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. ఇవి ఎలాంటి ఉత్తర్వులు అంటూ న్యాయమూర్తి తల పట్టుకున్నారు.

Updated Date - 2023-05-26T14:13:36+05:30 IST