Pushpa Movie : ‘పుష్ప’ మూవీ స్టైల్లో ఎర్ర చందనం అక్రమ రవాణా..

ABN , First Publish Date - 2023-08-04T13:46:46+05:30 IST

‘పుష్ప’ సినిమా స్టైల్లో ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తున్న వారిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పుష్ప సినిమాలో మాదిరిగా అంబులెన్సు ద్వారా ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తున్న వారి గుట్టును నేడు టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. అంబులెన్స్‌లో ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

Pushpa Movie : ‘పుష్ప’ మూవీ స్టైల్లో ఎర్ర చందనం అక్రమ రవాణా..

తిరుపతి : ‘పుష్ప’ సినిమా స్టైల్లో ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తున్న వారిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పుష్ప సినిమాలో మాదిరిగా అంబులెన్సు ద్వారా ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తున్న వారి గుట్టును నేడు టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. అంబులెన్స్‌లో ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బాలపల్లి ఫారెస్ట్‌లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో 10 మంది స్మగ్లర్లు,10 ఎర్ర చందనం దుంగలు, ఒక అంబులెన్సు సుమోను పట్టుకున్నట్లు డీఎస్పీ మురళీధర్ వెల్లడించారు. వాటి విలువ రూ.20 నుంచి 25 లక్షల వరకు ఉంటుందన్నారు. అంబులెన్స్‌లో పేషెంట్‌గా నటిస్తూ చెక్ పోస్ట్‌లను సునాయాసంగా దాటుతూ ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తునట్లు గుర్తించారు. మరో నలుగురు పరారయ్యారు. వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని టాస్క్ పోర్స్ డీఎస్పీ మురళిధర్ తెలిపారు.

Updated Date - 2023-08-04T13:46:46+05:30 IST