Special train: అనంతపురం, గుత్తి మీదుగా ప్రత్యేక రైలు.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే...
ABN , First Publish Date - 2023-11-15T12:19:45+05:30 IST
ప్రయాణికుల రద్దీ నియంత్రణకు యశ్వంతపూర్-ముజఫ్ఫర్‌పూర్ మధ్య అనంతపురం, గుత్తి(Anantapur, Gutti) మీదుగా అప్ అండ్ డౌన్
గుంతకల్లు(అనంతపురం): ప్రయాణికుల రద్దీ నియంత్రణకు యశ్వంతపూర్-ముజఫ్ఫర్‌పూర్ మధ్య అనంతపురం, గుత్తి(Anantapur, Gutti) మీదుగా అప్ అండ్ డౌన్ సింగిల్ ట్రిప్ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యశ్వంతపూర్-ముజఫ్ఫర్‌పూర్ ప్రత్యేక రైలు (నెం.06225) 16వ తేదీ ఉదయం ఏడున్నరకు యశ్వంతపూర్‌లో బయలుదేరి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ముజఫ్ఫర్‌పూర్‌కు చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో (నెం.06226) 22వ తేదీ మధ్యాహ్నం మూడున్నరకు ముజఫ్ఫర్‌పూర్ లో బయలుదేరి శుక్రవారం సాయంత్రం ఏడు గంటల కు యశ్వంతపూర్‌కు చేరుకుంటుందన్నారు. ఈ రైలు ధర్మవ రం, అనంతపురం, గుత్తి, డోన్, కర్నూలు సిటీ, గద్వాల, మహబూబ్‌నగర్(Kurnool City, Gadwala, Mahabubnagar), జడ్చర్ల, షాద్‌నగర్, కాచిగూడ(Kachiguda), జన్గావ్, ఖాజీపేట, రామగుండం, సిర్పూర్ కాగజ్‌నగర్(Ramagundam, Sirpur Kagaznagar), బలార్షా, నాగపూర్, ఇటార్సి, పిప్రియ, నరసింగపూర్, జబల్పూర్, సాట్నా, మానిక్‌పూర్, ప్రయాగరాజ్ చౌకీ, బక్సర్, పాటలీపుత్ర, హాజీపూర్ స్టేషన్ల మీదుగా వెళుతుందన్నారు.