Srikakulam Dist.: వైసీపీ సర్పంచ్ గృహ నిర్బంధం

ABN , First Publish Date - 2023-07-06T15:52:23+05:30 IST

శ్రీకాకుళం: జిల్లాలో పోలీస్ బందోబస్తు లేకుండా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు జనాల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి తన నియోజకవర్గంలో సొంతపార్టీ నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.

Srikakulam Dist.: వైసీపీ సర్పంచ్ గృహ నిర్బంధం

శ్రీకాకుళం: జిల్లాలో పోలీస్ బందోబస్తు లేకుండా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు (YCP Leaders) జనాల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పాతపట్నం (Patapatnam) ఎమ్మెల్యే రెడ్డి శాంతి (MLA Reddy Shanthi) తన నియోజకవర్గంలో సొంతపార్టీ నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. మెలియాపుట్టి మండలం, గోకన్నపురంలో ఎమ్మెల్యే జగనన్న సురక్ష కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే గ్రామంలో అభివృద్ధి మాటే లేకపోవడంతో గ్రామస్తులంతా ఎమ్మెల్యేను నిదీయాలని నిర్ణయించారు. దీంతో సొంతపార్టీ సర్పంచ్ (Sarpanch) సేనాపతి రవికుమార్‌ (Senapati Ravikumar)పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు సర్పంచ్‌ను గృహ నిర్బంధం చేశారు. గ్రామంలో భారీగా మోహనించారు. సర్పంచ్ హౌస్ అరెస్టు (House Arrest)పై గ్రామస్తులు మండిపడుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహించిన సర్పంచ్ రవికుమార్ సెల్పీ వీడియో విడుదల చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ కూడా గ్రామాల్లో తిరిగే పరిస్థితి కనబడడంలేదు. నాలుగేళ్లలో పాలన గాలికొదిలేశారు. గ్రామాల్లో ఉండే మౌళిక వసతులు, గ్రామాభివృద్ధిపై శ్రద్ధ చూపడంలేదు. ఇప్పుడు జగనన్న సురక్ష పేరుతో ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వస్తుంటే.. ప్రజలు నేతలను అడ్డుకుని నిలదీస్తున్నారు.

Updated Date - 2023-07-06T15:52:23+05:30 IST