AP News : శ్రీకాకుళంలో కాలేజీకి వెళుతున్న యువతిని స్నేహితులు చూస్తుండగానే..

ABN , First Publish Date - 2023-07-03T11:55:41+05:30 IST

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. నవభారత్ జంక్షన్ సమీపంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌నకు గురైన అమ్మాయి ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేటకు చెందిన దుర్గాభవానిగా గుర్తించారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. సైకిల్‌పై కాలేజీకి వెళుతుండగా కొందరు వ్యక్తులు కారులో వచ్చి తోటి స్నేహితులు చూస్తుండగానే ఎత్తుకెళ్లారు.

AP News : శ్రీకాకుళంలో కాలేజీకి వెళుతున్న యువతిని స్నేహితులు చూస్తుండగానే..

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. నవభారత్ జంక్షన్ సమీపంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌నకు గురైన అమ్మాయి ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేటకు చెందిన దుర్గాభవానిగా గుర్తించారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. సైకిల్‌పై కాలేజీకి వెళుతుండగా కొందరు వ్యక్తులు కారులో వచ్చి తోటి స్నేహితులు చూస్తుండగానే ఎత్తుకెళ్లారు. అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలే దుర్గా భవానికి కుటుంబ సభ్యులు వివాహం చేశారు. కారణమేంటో కానీ ఆమె కాపురానికి వెళ్లకుండా కన్నవారి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలోనే భర్తే దుర్గా భవానిని కిడ్నాప్ చేయించి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-07-03T11:55:41+05:30 IST