GVL: ఏపీలో స్టిక్కర్ల కాంపిటీషన్ నడుస్తోంది: జీవీఎల్
ABN , First Publish Date - 2023-04-20T18:39:26+05:30 IST
ఏపీలో స్టిక్కర్ల కాంపిటీషన్ నడుస్తోంద ఎంపీ జీవీఎల్ (MP GVL) ఎద్దేవాచేశారు. జగనన్నే తమ భరోసా అంటూ స్టిక్కర్లు అతికిస్తున్నారని, అతికించిన స్టిక్కర్లను ప్రజలు పీకేస్తున్నారని తెలిపారు.
ఢిల్లీ: ఏపీలో స్టిక్కర్ల కాంపిటీషన్ నడుస్తోంద ఎంపీ జీవీఎల్ (MP GVL) ఎద్దేవాచేశారు. జగనన్నే తమ భరోసా అంటూ స్టిక్కర్లు అతికిస్తున్నారని, అతికించిన స్టిక్కర్లను ప్రజలు పీకేస్తున్నారని తెలిపారు. విశాఖ నుంచి పాలన అంటున్నారని, విశాఖ అభివృద్ధికి ఏం తపనపడ్డారు? అని ప్రశ్నించారు. అభివృద్ధి అంటే భూములు లాక్కోవడమా అని జీవీఎల్ నిలదీశారు. జనసేన మూడేళ్లుగా తమ కూటమిలో ఉందని గుర్తుచేశారు. వైసీపీని గద్దె దించాలన్నదే బీజేపీ-జనసేన (BJP Janasena) లక్ష్యమని జీవీఎల్ ప్రకటించారు.
ఏప్రిల్ 22 నుంచి మే 9 వరకు గంగా పుష్కరాలు
ఏప్రిల్ 22 నుంచి మే 9 వరకు గంగా పుష్కరాలు నిర్వహించనున్నారు. వైశాఖ శుక్ల విదియ రోజున గురుడు మేషరాశిలో ప్రవేశించడంతో గంగా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి.12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలు మే 3న వైశాఖ శుక్ల ద్వాదశి నాడు ముగియనున్నాయి. పుష్కరుడు ఈ 12 రోజుల పాటు గంగానదిలో ఉంటాడని హిందువులు విశ్వసిస్తారు. అందుకే పుష్కర సమయలో గంగా స్నానం, దానం, పితృదేవతలకు తర్పణం చేయడం వంటి క్రతువులు నిర్వహిస్తారు. 29న వారణాసి గంగాఘాట్ దగ్గర కాశీ తెలుగు సంగమం కార్యక్రమం నిర్వహిస్తారు. జీవీఎల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ (Prime Minister Modi) పాల్గొననున్నారు. గంగా పుష్కరాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. సికింద్రాబాద్, తిరుపతి, గుంటూరు నుంచి 18 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు జీవీఎల్ తెలిపారు.