AP HighCourt: రుషికొండలో అక్రమాలపై హైకోర్టులో అనుబంధ పిటిషన్
ABN , Publish Date - Dec 14 , 2023 | 03:26 PM
Andhrapradesh: రుషికొండలో అక్రమాలపై హైకోర్ట్‌లో అనుబంధ పిటిషన్ దాఖలైంది. పరిశీలనకు వచ్చిన కమిటీకి అక్రమాలపై పిటిషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విశాఖ జన సేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తరపున పిటిషన్ దాఖలైంది.
అమరావతి: రుషికొండలో అక్రమాలపై హైకోర్ట్‌లో (AP HighCourt) అనుబంధ పిటిషన్ దాఖలైంది. పరిశీలనకు వచ్చిన కమిటీకి అక్రమాలపై పిటిషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విశాఖ జన సేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ (Visakha JanaSena Corporator Peethala Murthy Yadav) తరపున పిటిషన్ దాఖలైంది. కమిటీ పర్యటన పూర్తయిందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి చెప్పారు. వెంటనే మూర్తి యాదవ్ ఇచ్చిన నివేదికను కమిటీకి పంపాలని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. రుషికొండలో తవ్విన దెబ్రిస్‌ను సముద్రంలో వేయడం సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. సీఆర్‌జెడ్ పరిధిలో భూగర్భ జలాలు వినియోగం కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని మూర్తి యాదవ్ పేర్కొన్నారు. అక్రమాలు అన్నింటినీ మూర్తి యాదవ్ సాక్ష్యాధారాలతో సహా కోర్టుకు సమర్పించారు. ఈ నివేదికను వెంటనే కమిటీకి పంపాలని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.