TarakaRatna : ఐసీయూలో తారకరత్నను చూసి బయటికొచ్చాక చంద్రబాబు ఏం చెప్పారంటే..

ABN , First Publish Date - 2023-01-28T20:46:04+05:30 IST

ఐసీయూలో చికిత్స పొందుతున్న తారకరత్నను చంద్రబాబు చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..

TarakaRatna : ఐసీయూలో తారకరత్నను చూసి బయటికొచ్చాక చంద్రబాబు ఏం చెప్పారంటే..

బెంగళూరు : సినీ నటుడు నందమూరి తారకరత్న (TarakaRatna) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే (Highly Critical) ఉంది. ఐసీయూలో (ICU) ప్రత్యేక వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. గుండెనాళాల్లోకి రక్తప్రసరణ కాకపోవడంతో బెలూన్ యాంజియోప్లాస్టీ (Angioplasty) ద్వారా పంపింగ్ చేసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. బెంగళూరు నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆస్పత్రికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు.. (Nara Chandrababu) తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న తారకరత్నను చంద్రబాబు చూశారు. అనంతరం తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మీడియాతో మాట్లాడిన బాబు.. తారకరత్న ఆరోగ్య వివరాలు వెల్లడించారు. తారకరత్నను అబ్జర్వేషన్‌లో పెట్టారని తెలిపారు. ఐసీయూలో తారకరత్నకు చికిత్స అందుతోందని.. ఎప్పుటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడానని.. బ్లాక్స్ ఎక్కువగా ఉన్నందున కోలుకోవడానికి టైమ్ పడుతుందన్నారు. తారకరత్న త్వరలో కోలుకుంటారని భావిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

కుటుంబ సభ్యులంతా అక్కడే..

తారకరత్నకు గుండెపోటు వచ్చినప్పటి నుంచీ.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu) వైద్యులు, కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడి ఆరాతీస్తున్నారు. శనివారం సాయంత్రం 5.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన చంద్రబాబు.. బెంగళూరుకు చేరుకున్నారు. కాగా.. శుక్రవారం అర్ధరాత్రి కుప్పం నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించగా.. ఆయన వెంట ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఉన్నారు. తారకరత్న భార్య, కుమార్తెలు రాత్రి నుంచి ఆస్పత్రిలోనే ఉన్నారు. పురంధేశ్వరి (Daggubati Purandeswari) కూడా ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్యంపై ఆరాతీశారు.

అన్నదమ్ములిద్దరూ..!

మరోవైపు.. ఆదివారం ఉదయం టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr), కల్యాణ్ రామ్ (Kalyan Ram) కూడా హృదయాలయ ఆస్పత్రికి చేరుకోనున్నారు. ఇవాళ రాత్రే బెంగళూరుకు వెళ్లాలని ఎన్టీఆర్ భావించినా కొన్ని అనివార్యకారణాల వల్ల ఆదివారం వెళ్తున్నారు. ఇక.. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెసివిస్ట్‌లు, ఇతర స్పెషలిస్టులు తారకరత్న ఆరోగ్యాన్ని ఎప్పుటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయినా తారకరత్న ఆరోగ్యపరిస్థితి క్షీణిస్తోందని తెలుసుకున్న నందమూరి.. నారా కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. సోమవారం మరోసారి వైద్య పరీక్షలు చేస్తామని వైద్యులు చెబుతున్నారు.

Updated Date - 2023-01-28T21:02:30+05:30 IST