TarakaRatna : తారకరత్న ఆరోగ్యంపై కీలక అప్డేట్.. ఆయన చెప్పిన ఒకే ఒక్క మాటతో..

ABN , First Publish Date - 2023-01-30T16:09:56+05:30 IST

సినీ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) ఆరోగ్య పరిస్థితిపై (Health Condition) కీలక అప్డేట్ వచ్చింది.

TarakaRatna : తారకరత్న ఆరోగ్యంపై కీలక అప్డేట్.. ఆయన చెప్పిన ఒకే ఒక్క మాటతో..

బెంగళూరు : సినీ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) ఆరోగ్య పరిస్థితిపై (Health Condition) కీలక అప్డేట్ వచ్చింది. తారకరత్న ఆరోగ్యంపై ఆయన బాబాయ్.. నందమూరి రామకృష్ణ(Nandamuri Ramakrishna) స్పందించారు. సోమవారం మధ్యాహ్నం తారకరత్నను ఐసీయూలో (ICU) చూసి బయటికొచ్చిన ఆయన మీడియాతో (Media) మాట్లాడి వివరాలు వెల్లడించారు. ఆయన ఆరోగ్యం (Health) నిన్న, మొన్నటితో పోలిస్తే కాస్త మెరుగుపడిందని (Betterment) రామకృష్ణ తెలిపారు. అవయవాలన్నీ (Body Parts) చికిత్సకు స్పందిస్తున్నాయని చెప్పారు. అయితే ఇంకా వెంటిలేటర్‌పైనే (Ventilator) ఉన్నారన్నారు. తారకత్నకు ఎక్మో (ECMO) పెట్టారన్న వార్తలపై రామకృష్ణ స్పందించారు. ఎక్మో పెట్టలేదని.. అవన్నీ అవాస్తవాలేనని రామకృష్ణ కొట్టిపారేశారు. రామకృష్ణ చెప్పిన ఈ ఒక్క మాట నందమూరి (Nandamuri), నారా ఫ్యామిలీ (Nara Family), అభిమానులు (Fans), టీడీపీ కార్యకర్తలకు (TDP Activists) కాస్త ఉపశమనం (Relief) కలిగించేదని చెప్పుకోవచ్చు.

రిపోర్టుపై ఆందోళన..!

సిటీ స్కాన్ రిపోర్ట్ (City Scan Report) వచ్చాక బ్రెయిన్ పనితీరుపై (Brain Condition) క్లారిటీ వస్తుందని రామకృష్ణ చెప్పారు. ఐసీయూలో న్యూరాలజిస్టుల (Neurologist) పర్యవేక్షణ మధ్య తారకరత్న వైద్యం తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. సోమవారం ఉదయం తారకరత్నకు సిటీ స్కాన్‌ చేశారు వైద్యులు. ఈ రిపోర్టు రావాడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. ఓ వైపు రిపోర్టులో ఏం వస్తుందనే దానిపైనా కుటుంబ సభ్యుల్లో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నారాయణ హృదయాలయ ఆస్పత్రిలోనే (Narayana Hrudayalaya) ఉంటూ వైద్యులను అడిగి ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.

Ramakrishna-1.jpg

సాయంత్రంలోపు బులెటిన్..

ఇవాళ సాయంత్రంలోపు తారకరత్న హెల్త్ బులెటిన్‌ను (Health bulletin) ఆస్పత్రి వర్గాలు విడుదల చేయనున్నాయి. రిపోర్టు ఎలా వస్తుందనే దానిపై నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు వేయికళ్లతో వేచి చూస్తున్నారు. గుండెపోటు (Heart Attack) వచ్చిన తర్వాత 30 నిమిషాలపాటు (30 Minutes) మెదడు పనితీరుపై ప్రభావం (Effect on Brain) పడినట్లు వైద్యులు (Doctors) గుర్తించినట్లు ఇదివరకే చెప్పారు. ప్రస్తుతం ఇద్దరు న్యూరో సర్జన్లు సహా 10మంది వైద్యులు తారకరత్న ఆరోగ్యాన్ని నిత్యం (Daily) పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు.. ఆస్పత్రి వద్ద సందర్శకుల తాకిడి పెరగడంతో బెంగళూరు పోలీసులు (Bangalore Police) భద్రత కట్టుదిట్టం చేశారు.Ramakrishna.jpg

Updated Date - 2023-01-30T16:24:26+05:30 IST