TDP: వినుకొండ వైసీపీ ఎమ్మెల్యేపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-08-03T22:00:42+05:30 IST
వినుకొండ వైసీపీ (YCP) ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై టీడీపీ (TDP) మాజీ ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు ఫైర్ అయ్యారు.
పల్నాడు జిల్లా: వినుకొండ వైసీపీ (YCP) ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై టీడీపీ (TDP) మాజీ ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు ఫైర్ అయ్యారు.
"బొల్లా బ్రహ్మ నాయుడు ఓ పనికి మాలిన వెదవా. వినుకొండ ఎమ్మెల్యే రాష్ట్రంలోనే అత్యంత అవినీతి పరుడు. చంద్రబాబు, లోకేష్‌ను విమర్శలు చేసే అంతా స్థాయి బొల్లాకు లేదు. బొల్లా అవినీతి అంతా బట్టబయలు చేస్తాం. బొల్లా దోపిడీలను వినుకొండ ప్రజలు గమనించారు. మగతనం గురించి బొల్లా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. అవినీతిపై సవాల్ చేస్తే పారిపోయిన సన్యాసి బొల్లా. వినుకొండలో యువగళం బహిరంగ సభను చూసి బొల్లాకు మైండ్ బ్లాక్ అయింది. ఓటమి భయంతో పిచ్చి వాగుడు వాగుతున్నాడు. చివరకు సీటు కూడా రాదనే టెన్షన్ పట్టుకుంది." అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు.