Ram Gopal Varma: ఆర్జీవీ వ్యాఖ్యలపై టీడీపీ ఫైర్
ABN , First Publish Date - 2023-03-16T18:56:29+05:30 IST
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆర్జీవీపై యూజీసీ చైర్ పర్సన్
అమరావతి: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆర్జీవీపై యూజీసీ చైర్ పర్సన్, నేషనల్ ఉమెన్ కమిషన్‌కు తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) ఫిర్యాదు చేశారు. ఆర్జీవీ వ్యాఖ్యల వీడియోలు, పేపర్ క్లిప్పింగ్‌లను జత చేసి చైర్‌పర్సన్‌కు లేఖ రాశారు. వర్మ వ్యాఖ్యలను సమర్ధించిన యూనివర్సిటీ వీసీ రాజశేఖర్‌పై కూడా చర్యలు తీసుకోవాలని అనిత విజ్ఞప్తి చేశారు.
టీఎన్‌ఎస్‌ఎఫ్ నిరసన
రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నాగార్జున యూనివర్సిటీ ఎదుట టీఎన్‌ఎస్‌ఎఫ్ (TNSF) ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ప్రదర్శన చేశారు. రాంగోపాల్ వర్మ, యూనివర్సిటీ వీసీ రాజశేఖర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీసీని తక్షణమే భర్తరఫ్ చేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుటు డిమాండ్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
రాంగోపాల్‌వర్మ వ్యాఖ్యలతో దుమారం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (Nagarjuna University)లో రాంగోపాల్ వర్మ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నచ్చింది తిని, తాగి ఎంజాయ్ చేయండని చెప్పారు. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళితే అక్కడ రంభ, ఊర్వశిలు ఉండకపోవచ్చు అని... కాబట్టి బతికున్నప్పుడే జీవితాన్ని ఎంజాయ్ చేయాలని సూచించారు. నచ్చిన విధంగా బతకాలని, ఎవరు కూడా హార్డ్‌వర్క్ (Hard work) చేయకుండా, ఉపాధ్యాయుల మాటలు పట్టించుకోకుండా ఇష్టానుసారం జీవించాలన్నారు.