Share News

TDP: ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడాన్ని ఖండిస్తూ కుమార్ రాజా నిరసన..అరెస్ట్

ABN , First Publish Date - 2023-11-15T19:27:51+05:30 IST

పామర్రులో ఉద్రిక్తత నెలకొంది. పామర్రు నియోజవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ వర్ల కుమార్ రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. పామర్రు ఎన్టీఆర్ సర్కిల్‌లో ఎన్టీఆర్ చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలను తొలగించడాన్ని ఖండిస్తూ కుమార్ రాజా నిరసన కార్యక్రమం చేపట్టారు.

TDP: ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడాన్ని ఖండిస్తూ కుమార్ రాజా నిరసన..అరెస్ట్

కృష్ణా జిల్లా: పామర్రులో ఉద్రిక్తత నెలకొంది. పామర్రు నియోజవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ వర్ల కుమార్ రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. పామర్రు ఎన్టీఆర్ సర్కిల్‌లో ఎన్టీఆర్ చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలను తొలగించడాన్ని ఖండిస్తూ కుమార్ రాజా నిరసన కార్యక్రమం చేపట్టారు. సర్కిల్లో ఎన్టీఆర్ చిత్రాలతో కూడిన ఫోటోలను ఏర్పాటు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అన్నగారు జన్మించిన పామర్రులో ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడమేంటంటూ పోలీసులను టీడీపీ నేతలు ప్రశ్నించారు.

పోలీసుల అనుచిత వైఖరికి నిరసనగా కుమార్ రాజా నడిరోడ్డుపై పడుకున్నారు. దీంతో కుమార్ రాజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల జులుం నశించాలంటూ నినాదాలు చేస్తూ పోలీస్ వ్యాన్‌కు అడ్డుగా టీడీపీ శ్రేణులు నిలబడ్డారు. కుమార్ రాజాతో పాటు, పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌‌కు తరలించారు.

Updated Date - 2023-11-15T19:29:57+05:30 IST