Atchannaidu: పరిటాల సునీత దీక్ష భగ్నం.. అరాచక పాలనకు నిదర్శనం

ABN , First Publish Date - 2023-09-26T12:53:51+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు కోసం మాజీ మంత్రి పరిటాల సునీత చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేయడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పందించారు.

Atchannaidu: పరిటాల సునీత దీక్ష భగ్నం.. అరాచక పాలనకు నిదర్శనం

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Arrest) కోసం మాజీ మంత్రి పరిటాల సునీత (Former Minister Paritala Sunitha) చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేయడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం అరాచక పాలనకు నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారని విరుచుకుపడ్డారు. పరిటాల సునీత పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారన్నారు. మహిళల పట్ల కక్షపూరితంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పౌరుల హక్కులను కాలరాస్తూ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-09-26T12:53:51+05:30 IST