Atchannaidu: రైలు ప్రమాదంలో 200పైగా ప్రాణాలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా
ABN , First Publish Date - 2023-06-03T10:43:21+05:30 IST
ఒడిశా రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఒకేసారి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడాన్ని మనసు జీర్ణించుకోలేకపోతోందన్నారు.
అమరావతి: ఒడిశా రైలు ప్రమాదం (Odisha Train Accident) తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (TDP Leader Atchannaidu) అన్నారు. ఒకేసారి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడాన్ని మనసు జీర్ణించుకోలేకపోతోందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారికి మనోస్థైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి ఒడిశా ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైల్వే అధికారులతో మాట్లాడి ఏపీకి చెందిన బాధితుల వివరాలను సేకరించాలని.. వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను కేంద్రం అన్ని విధాల ఆదుకోవాలని అచ్చెన్నాయుడు తెలిపారు.