Chintamaneni: బండారు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు
ABN , First Publish Date - 2023-10-03T12:37:50+05:30 IST
చిన్న స్థాయి నేతల నుంచి మాజీ ముఖ్యమంత్రి వరకు కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్నారని టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: చిన్న స్థాయి నేతల నుంచి మాజీ ముఖ్యమంత్రి వరకు కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్నారని టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ (TDP Leader Chintamaneni Prabhakar) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం పోలీసుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. బండారు సత్యనారాయణ మూర్తికి (Former Minister Bandaru Satyanarayana Murthy) పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడిన దాంట్లో ఏ తప్పూ లేదని కూడా తాము సమర్థిస్తున్నామన్నారు. నాడు శాసనసభలో టీడీపీ నేతలపై కామెంట్లు చేసినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. స్పీకర్‌ను పక్కన పెట్టుకుని మాట్లాడినప్పుడు ఎందుకు ఖండిచలేదని నిలదీశారు. ఇప్పుడు రోజాపై (Minister Roja) కామెంట్ చేస్తే మాత్రం తప్పుగా కనిపించిందా అంటూ మండిపడ్డారు. ముందు సభలో మాట్లాడిన వైసీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని చింతమనేని ప్రభాకర్ డిమాండ్ చేశారు.