Home » Chintamaneni Prabhakar
‘కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యులతో మాట్లాడతాను.
దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.
Chintamaneni Prabhakar: వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబుపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తప్పు చేసిన వారి పట్ల చట్టం అమలు కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ, చేసిన తప్పుల నుంచి ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు.
Denduluru Politics: ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై హత్యాయత్నం జరిగింది. ఓ వివాహ వేడుకలో చింతమనేని ప్రభాకర్ , మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఈ వివాదంలో చింతమనేని డ్రైవర్, గన్‌మ్యాన్‌లపై అబ్బయ్యచౌదరి దాడికి పాల్పడ్డారు.ఈ దాడితో అబ్బయ్యచౌదరి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
YCP vs TDP: ఏలూరు జిల్లాలో మరోమారు వైసీపీ, టీడీపీ నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. ఓ కార్యక్రమంలో ఇరువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో ఏలూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల జోక్యం చేసుకుని ఇరు పార్టీల వారిని శాంతపరిచారు.
Andhrapradesh: వైసీపీ హయాంలో ఎమ్మెల్యే చింతమనేనిపై 27 అక్రమ కేసులు నమోదు అవగా.. పల్లె రఘునాథ్ రెడ్డిపై 14 అక్రమ కేసులు నమోదు అయ్యాయి. తన కోడలి రాజకీయ జీవితంపైనా పల్లె రఘునాథ్ రెడ్డి పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు.
ఓటమి భయంతో వైసీపీ (YSRCP) నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దెందులూరు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) అన్నారు. దెందులూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. శనివారం నాడు దెందులూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై చింతమనేని ప్రభాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) స్పీడ్ పెంచారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్న నేతలకు బీఫామ్స్(B-Forms) అందజేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలకు బీఫామ్స్ అందజేసిన పసుపు దళపతి.. తాజాగా చింతమనేని ప్రభాకర్‌కు(Chintamaneni Prabhakar) ఫోన్ చేశారు.
తెలుగుదేశం పార్టీలో దెందులూరు, తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతొంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తితో ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ముడిపడి ఉందని తెలుస్తోంది. అనపర్తి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీ బీజేపీలో చేరి పోటీ చేసేందుకు అంగీకరించారు.
సీఎం జగన్ రెడ్డి (CM Jagan) పై జరిగిన రాయి దాడి వెనుక ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) సంచలన ఆరోపణలు చేశారు. జగన్ రెడ్డిపై రాయి దాడి పెద్ద డ్రామా అని ఎద్దేవా చేశారు. రాయి దాడి వెనుక స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సజ్జలదేనని ఆరోపించారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సజ్జల ఫ్రీ ప్లాన్‌తో జగన్‌పై సింపతి కోసమే రాయి దాడి చేయించుకున్నారని విమర్శించారు.