Pattabhi: రాజకీయాల్లో జగన్ పాత్ర స్పైడర్ సినిమాలో విలన్ పాత్ర

ABN , First Publish Date - 2023-09-23T15:50:55+05:30 IST

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరుగుతుందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ వ్యాఖ్యలు చేశారు.

Pattabhi: రాజకీయాల్లో జగన్ పాత్ర స్పైడర్ సినిమాలో విలన్ పాత్ర

విజయవాడ: రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరుగుతుందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ (TDP Leader Kommareddy Pattabhi Ram) వ్యాఖ్యలు చేశారు. శనివారం జైభీం భారత్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పట్టాభి మాట్లాడుతూ... విజయవాడలో అంబేద్కర్ విగ్రహం పెట్టి దళితులను మేలు చేస్తున్నట్లు మాయ చేస్తున్నారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి ప్రభుత్వం అసత్యాలు చెబుతోందని మండిపడ్డారు. వాస్తవాలు ప్రజలకు చెప్పాలనే 40 డాక్యుమెంట్లను తాము ప్రజల ముందు ఉంచామన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌పై ఒక వెబ్ సైట్ కూడా తీసుకువచ్చామన్నారు. జగన్ నేడు 10వ బెయిల్ వార్షికోత్సవం జరుపుకుంటున్నారని.. నేటి సమావేశంలో జగన్ బెయిల్ వార్షికోత్సవంపై తీర్మానం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన వ్యక్తి నేడు అవినీతిపై నీతులు చెబుతున్నారన్నారు. గత నాలుగేళ్ల జగన్ చేయని స్కామ్స్ లేవన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌పై సీబీఐ దర్యాప్తు చేయాలని గోదావరి ఒడ్డున ఉన్న ఒక స్వయం ప్రకటిత మేధావి అడుగుతున్నారని ఆయన తెలిపారు.


రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, దాడులు ఆ మేధావికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి చేస్తే నాలుగున్నరేళ్లు ఏం చేశారని అడిగారు. చంద్రబాబును ఎదుర్కోలేక ప్రజల నుంచి ఆయనను దూరం చేయాలనే అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. రాజకీయాల్లో జగన్ పాత్ర స్పైడర్ సినిమాలో విలన్ పాత్ర అని అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసినా ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరొకవైపు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో టీడీపీ తప్పకుండా పెద్దన్న పాత్ర పోషిస్తుందని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్‌ను అన్ని పార్టీల నాయకులు ఖండించారన్నారు. నాలుగేళ్ళ నుంచి న్యాయస్థానికి హాజరుకాకుండా పారిపోతున్న వ్యక్తి జగన్ అని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం నారా, నందమూరి కుటుంబాలు పోరాటానికి సిద్ధంగా ఉన్నాయని కొమ్మారెడ్డి పట్టాభి స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-23T15:50:55+05:30 IST