Lokesh: ఢిల్లీలో లోకేశ్ ఒకరోజు నిరాహార దీక్ష ప్రారంభం

ABN , First Publish Date - 2023-10-02T10:16:35+05:30 IST

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌‌కు నిరసనగా గాంధీ జయంతి సందర్భంగా సత్యాగ్రహ దీక్షలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఢిల్లీలో ఒక రోజు నిరాహార దీక్షను మొదలుపెట్టారు. చంద్రబాబు, భువనేశ్వరీల దీక్షలకు మద్దతుగా ఢిల్లీలో యువనేత నిరాహార దీక్ష చేపట్టారు.

Lokesh: ఢిల్లీలో లోకేశ్ ఒకరోజు నిరాహార దీక్ష ప్రారంభం

న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌‌కు (TDP Chief Chandrababu Arrest) నిరసనగా గాంధీ జయంతి (Gandhi Jayanthi) సందర్భంగా సత్యాగ్రహ దీక్షలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (TDP Leader Nara Lokesh) ఢిల్లీలో ఒక రోజు నిరాహార దీక్షను మొదలుపెట్టారు. చంద్రబాబు, భువనేశ్వరీల (Nara Bhuvaneshwari) దీక్షలకు మద్దతుగా ఢిల్లీలో యువనేత నిరాహార దీక్ష చేపట్టారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ (MP kanakamedala ravindra kumar) నివాసంలో లోకేశ్ దీక్షకు మద్దతు తెలిపేందుకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. దీక్షలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్ (MP Galla Jayadesh), కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని (Kesineni Nani), రామ్మోహన్ నాయుడు (Rammohan naidu) పాల్గొన్నారు.


అటు రాజమండ్రి సెంట్రల్ జైలులో తన అక్రమ అరెస్ట్‌కు నిరసనగా చంద్రబాబు సత్యాగ్రహ దీక్ష చేయనున్నారు. అలాగే రాజమండ్రిలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నారు. మంగళగిరిలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) సత్యాగ్రహ దీక్షకు దిగనున్నారు. వీరి దీక్షలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు దీక్షలు చేపట్టనున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్షలు కొనసాగనున్నాయి.

Updated Date - 2023-10-02T10:16:35+05:30 IST