Nakka Anandbabu: భువనేశ్వరి ములాఖత్‌ను నిరాకరించడం అప్రజాస్వామికం

ABN , First Publish Date - 2023-09-15T12:38:15+05:30 IST

జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసేందుకు సతీమణి భువనేశ్వరి చేసుకున్న ములాఖాత్‌ను జైలు అధికారులు నిరాకరించడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు.

Nakka Anandbabu: భువనేశ్వరి ములాఖత్‌ను నిరాకరించడం అప్రజాస్వామికం

బాపట్ల: జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) కలిసేందుకు సతీమణి భువనేశ్వరి (Nara Bhuvaneshwari)చేసుకున్న ములాఖాత్‌ను జైలు అధికారులు నిరాకరించడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... రాజ్యాంగ విరుద్ధం జగన్ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పేట్టినట్టు వైసీపీ నేతలకు కూడా తెలుసన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులను అన్ని వర్గాల మేధావులు ఖండిస్తున్నారని అన్నారు. జగన్‌కు అంటుకున్న అవినీతి మరక చంద్రబాబుకు అంటించాలని చూస్తున్నారన్నారు. జగన్సై (CM Jagan) కో నే కాదు పిచ్చోడు ఇతను పాలనకు పనికిరారు అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ఎన్ని రోజులు నిర్బంధించిన చివరకు కడిగిన ముత్యం లాగా బయటికి వస్తారన్నారు. గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు రాజభోగాలు అనుభవించారని తెలిపారు. చంద్రబాబు భద్రతపై ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారన్నారు. చంద్రబాబుకు ఏమన్నా అయితే జగన్‌కు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసం ఆలోచించి ముందుకు వచ్చారన్నారు. పిచ్చోడు జగన్‌ను తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని నక్కా ఆనందబాబు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-09-15T12:38:15+05:30 IST