Nara lokesh: మంగళగిరి కోర్టుకు లోకేశ్.. వాంగ్మూలం ఇస్తున్న యువనేత
ABN , First Publish Date - 2023-08-04T12:42:16+05:30 IST
తనపై వచ్చిన అసత్య ఆరోపణలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ న్యాయపోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు (శుక్రవారం) ఉదయం లోకేశ్ మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు.
అమరావతి: తనపై వచ్చిన అసత్య ఆరోపణలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (TDP Leader Nara lokesh) న్యాయపోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు (శుక్రవారం) ఉదయం లోకేశ్ మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు. లోకేశ్ మంగళగిరి కోర్టుకు (Mangalagiri Court) రావడంతో టీడీపీ (TDP) అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు తరలివచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ అజయ్ రెడ్డి (Former Chairman of Skill Development Ajay Reddy) అసత్య ఆరోపణలు, సాక్షిలో (sakshi) తప్పుడు కథనాలపై ఇప్పటికే న్యాయవాది ద్వారా లోకేశ్ నోటీసులు పంపారు. నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతో లోకేశ్ న్యాయవాదులు మంగళగిరి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. ఈ రెండు కేసుల వ్యవహారంలో తనపై చేసిన అసత్య ఆరోపణలపై లోకేశ్ న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇస్తున్నారు.
కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్‌లో భారీ స్కామ్ అని చైర్మన్ అజయ్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి లోకేశ్‌పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనకు సంబంధం లేని అంశంపై చేసిన ఆరోపణలతో అజయ్ రెడ్డికి లోకేశ్ నోటీసులు పంపించారు. దానికి సమాధానం లేకపోవడంతో పరువుకు భంగం కలిగించిన అజయ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. అలాగే స్కిల్స్ స్కామ్ అంటూ సాక్షిలో వేసిన కథనంపై కూడా ఆ పత్రికకు యువనేత నోటీసులు పంపారు. పత్రిక ఎటువంటి వివరణ ఇవ్వకపోవడంతో ఆ పత్రికపై కూడా మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు.
పాదయాత్రకు బ్రేక్
మంగళగిరి కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వనున్న నేపథ్యంలో లోకేశ్ ఈరోజు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. నిన్న(గురువారం) సాయంత్రం నుంచి పాదయాత్రకు విరామం ఇచ్చారు. తిరిగి రేపటి(శనివారం) నుంచి లోకేశ్ పాదయాత్ర యధావిధిగా సాగనుంది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో యువనేత పాదయాత్ర చేస్తున్నారు.