Lokesh YuvaGalam: ఈనెల 13న అమరావతిలోకి యువగళం.. పార్టీలకతీతంగా పాల్గొనాలంటూ..
ABN , First Publish Date - 2023-08-09T16:19:34+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది.
అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (TDP Leader Nara lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ నెల 13 నుంచి లోకేశ్ పాదయాత్ర రాజధాని అమరావతి ప్రాంతంలోకి ప్రవేశించనుంది. ఈ పాదయాత్రలో రాజధాని గ్రామాల ప్రజలు, రైతులకు, మహిళలకు, రైతు కూలీలు పాల్గొనాలని రాజధాని అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది. రాజధాని అమరావతి ఉద్యమానికి ఆదినుండి తెలుగు దేశం అండగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు 13, 14 తేదీల్లో తాడికొండ నియోజకవర్గంలో వెంట నడవాలని అమరావతి జేఏసీ నిర్ణయించింది. ఈనెల 15న నిడమర్రులోకి పాదయాత్ర రానుంది. తద్వారా లోకేశ్ సొంత నియోజకవర్గం మంగళగిరిలో యువగళం పాదయాత్ర ఎంటర్‌కానుంది. ఈ యువగళం పాదయాత్రలో అమరావతి గ్రామాల ప్రజలు, రైతులు, రైతు కూలీలు, మహిళలు పార్టీలకతీతంగా పాల్గొనాలని అమరావతి జేఏసీ నిర్ణయించింది. అమరావతి ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో యువగళం పాదయాత్రకు మద్దతు పలకాలని నిర్ణయించింది. 14న మధ్యాహ్నం 4 గంటలకు తాడికొండలో భారీ బహిరంగ సభ జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు జరిగే పాదయాత్ర, బహిరంగ సభలో పార్టీలకతీతంగా పాల్గొనాలని నిర్ణయించారు. రైతులు, రైతు కూలీలు, మహిళలు ఆకుపచ్చని కండవాలతో పాల్గొనాలని రాజధాని అమరావతి జేఏసీ సూచించింది.