TDP Leader: స్కిల్‌డెవలప్‌మెంట్‌లో నిజాలు తెలుసుకో.. ఉండవల్లిపై పట్టాభి ఫైర్
ABN , First Publish Date - 2023-09-22T14:45:13+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టి జైలులో పెట్టారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రెండు వారాలుగా ఏపీలో భయంకర పరిస్థితులు చూస్తున్నామన్నారు.
రాజమండ్రి: టీడీపీ అధినేత చంద్రబాబుపై (TDP Chief Chandrababu) తప్పుడు కేసు పెట్టి జైలులో పెట్టారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి (TDP Leader Pattabhi) వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రెండు వారాలుగా ఏపీలో భయంకర పరిస్థితులు చూస్తున్నామన్నారు. స్కిల్‌డెవలప్‌మెంట్ శిక్షణ కేంద్రాలను జగన్ నిర్వీర్యం చేశారన్నారు. సీఐడీ (CID) అధికారులు పొరుగు రాష్ట్రాల్లోను, డిల్లీలోను మీడియా సమావేశాలు పెట్టి అబాసుపాలయ్యారని తెలిపారు. రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) సీబీఐ విచారణ కోరటం అడగటం దుర్మార్గమన్నారు. వైసీపీ పాలనలో అవినీతి, లిక్కర్ స్కాంలో అవినీతి ఉండవల్లికి కన్పించలేదా ప్రశ్నించారు. వైసీపీ అవినీతిపై సీబీఐ విచారణ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎందుకు కోరలేదని ఆయన నిలదీశారు.
ఉండవల్లి ఎవరో రాసిన పిటిషన్లపై సంతకాలు పెట్టి హైకోర్టులో పిల్ దాఖలు చేశారా అని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్‌లో నిజాలు ఉండవల్లి తెలుసుకోవాలని సూచించారు. ఉండవల్లి ప్రజల్లో చులకన అయ్యారన్నారు. జగన్ ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా చంద్రబాబు నుంచి ప్రజలను వేరుచేయలేరన్నారు. స్నేహ బ్లాక్‌లో తాను 20 రోజులు ఉన్నానని.. స్నేహ బ్లాక్‌లో కోర్టు ఆదేశాలు పాటించకుండా చంద్రబాబును ఇబ్బందిపడుతున్నారన్నారు. జగన్‌కు జ్వరం రావటం రాజకీయ సమాధికి పునాదని చెప్పుకొచ్చారు. ఎన్ని మందులు వేసుకున్నా జగన్‌కు జ్వరం తగ్గదన్నారు. చంద్రబాబు జైలులో నుంచి వచ్చిన తర్వాత జగన్ మెడలు వంచుతామని హెచ్చరించారు. పారిపోయే అలవాటు జగన్‌కు ఉందని.. తమకు లేదన్నారు. బెయిల్‌పై బతకటానికి జగన్‌కు సిగ్గులేదా అని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు.