Home » Undavalli Aruna Kumar
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.
గత ప్రభుత్వ తప్పిదాలను ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తావించారు. అధికారులపై కేసులు పెట్టే అంశంపై జగన్ తప్పు చేశారని గుర్తుచేశారు. ఆ తప్పును చంద్రబాబు చేయకూడదని కోరారు. చంద్రబాబును జైలులో పెట్టి జగన్ పెద్ద తప్పు చేశారని ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తుచేశారు.
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచిందని.. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దశాబ్ద ఘోషగా మారిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. సరిగ్గా ఈ రోజుకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యిందన్నారు. తెలంగాణలో రాష్ట్రావిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారని.. ఏపీలో మాత్రం పరిస్థితి దశాబ్ద ఘోషగా మారిందన్నారు.
మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్ల విచారణను తిరిగి తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు పంపింది. కేవలం టెక్నికల్ రీజన్స్‌తోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం స్పష్టం చేసింది. కేసు మెరిట్స్‌లోకి తాము వెళ్లలేదని తెలిపింది.
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైలుకి వెళ్లారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలుస్తారని అన్నారు. ‘‘చంద్రబాబు హయాంలో బస్సులు పెట్టి పోలవరం ప్రాజెక్ట్‌ను చూపిస్తే.. పోలవరం ప్రాజెక్ట్‌ను చూడకుండా సీఎం జగన్ పోలీసులను పెట్టాడు’’ అని అరుణ్ కుమార్ అన్నారు. ఏపీ విభజన జరిగి నేటికి (ఆదివారం) పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ వాళ్లు విడుదల చేసిన పుస్తకం ఆధారంగా కోర్టులో పిటిషన్ వేశానని ఆయన చెప్పారు.
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) ను ఆయన నివాసంలో గురువారం నాడు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) కలిశారు. వీరిద్దరూ కాసేపటి క్రితమే భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు రాజకీయ అంశాలపై చర్చించారు.
ప్రముఖ బ్రాహ్మణ క్రైస్తవ ఇవాంజలిస్ట్ బ్రదర్ అనిల్ కుమార్ ( Brother Anil Kumar )తనయుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం జనవరి 18న, ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న విషయం తెలిసిందే. వివాహనికి సంబంధించిన ఏర్పాట్లకు బ్రదర్ అనిల్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.
Andhrapradesh: స్కిల్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి దాఖలు చేసిన పిల్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను సీబీఐకి అప్పగించేందుకు తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
Andhrapradesh: స్కిల్ డెవలప్‌మెంట్ కేసును సీబీఐకి ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది.
Andhrapradesh: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విచారణను సీబీఐకు ఇవ్వాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటీషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఉండవల్లి పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రతివాదులకు గతంలో నోటీసులు జారీ చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసింది.