Varla Ramaiah: చంద్రబాబు చేసిన తప్పేమీ లేదు
ABN , First Publish Date - 2023-09-12T13:05:56+05:30 IST
జగన్ రెడ్డి కళ్ళలో ఆనందం కోసం డీఐజీ రఘురాంరెడ్డి చంద్రబాబును అరెస్ట్ చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: జగన్ రెడ్డి (CM Jagan reddy) కళ్ళలో ఆనందం కోసం డీఐజీ రఘురాంరెడ్డి (DIG Raghuramreddy) చంద్రబాబును (TDP Chief Chandrababu Naidu) అరెస్ట్ చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన తప్పేమీ లేదని... స్కిల్ డెవలప్మెంట్ కేసు పెద్ద కేసు కాదన్నారు. మాజీ అధికారి పీవీ రమేష్ నిన్న (సోమవారం) చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. ‘‘నేను 16 నెలలు చంచల్ గూడా జైల్లో ఉన్నాను.. చంద్రబాబు కూడా కనీసం 16 వారాలైన జైల్లో ఉండాలి అనేది జగన్ కోరిక’’ అంటూ మండిపడ్డారు. నిరసనలు తెలియచెప్పే హక్కు ప్రతిపక్షాలకు లేదా అని నిలదీశారు. ఇది రాజ్యాంగ సంక్షోభం కాదా అంటూ ప్రశ్నించారు. తప్పు చేసిన అవినాష్ రెడ్డిని దర్జా బయటికి తిరిగితే.. తాము మాత్రం నిరసన తెలియచేయకూడదా అంటూ మండిపడ్డారు. కక్ష సాధింపే లక్ష్యంగా చంద్రబాబును జగన్ అరెస్ట్ చేయించారని వర్ల రామయ్య వ్యాఖ్యలు చేశారు.