TDP: టీడీపీ నిరసన.. మైలవరంలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2023-08-28T12:11:57+05:30 IST

ఏపీలో అధికార వైసీపీ ఇసుక దోపిడీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం మైలవరంలో ఉద్రిక్తతకు దారి తీసింది.

TDP: టీడీపీ నిరసన.. మైలవరంలో ఉద్రిక్తత

ఎన్టీఆర్ జిల్లా: ఏపీలో అధికార వైసీపీ ఇసుక దోపిడీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం మైలవరంలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఇసుక దోపిడీపై 28, 29, 30 తేదీలలో టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం మైలవరంలో ఇసుక డంపింగ్ స్టాక్ పాయింట్ వద్ద టీడీపీ నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమా, తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి శావల దేవదత్ నిరసనకు దిగారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకున్నారు. ఇసుక రీచ్‌ల వద్ద ధర్నా చేసుకోవాలని టీడీపీ ఆందోళనను మైలవరం సీఐ, ఎస్‌ఐలు మధ్యలో వచ్చి అడ్డుకున్నారు. ఈ క్రమంలో మైలవరంలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీస్ జులం నశించాలని, వైసీపీ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. దీంతో టీడీపీ నేతలు దేవినేని ఉమా, దేవదత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మైలవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2023-08-28T12:11:57+05:30 IST