Somireddy: సజ్జలపై సోమిరెడ్డి ఫైర్.. ఇదే జగన్ ఆలోచన..అప్పట్లో ఎందుకు నిరూపించలేకపోయారు..?
ABN , First Publish Date - 2023-07-25T21:37:06+05:30 IST
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై (Sajjala Ramakrishna Reddy) టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) విమర్శలు గుప్పించారు.
అమరావతి: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై (Sajjala Ramakrishna Reddy) టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) విమర్శలు గుప్పించారు. సీఐడీ తరహాలోనే సీబీఐ, ఎన్ఐఏలు వ్యవహరించాలని సజ్జల కోరుకుంటున్నారు. ముద్దాయిలను కాపాడాలి. అమాయకులను శిక్షించాలి. ఇదే జగన్ ఆలోచన. చంద్రబాబు వ్యవస్థల్లో వైరస్ లా పాకారంటూ సజ్జల సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. జగన్ సీఎం అయ్యాక.. సీబీఐ పరిధిలోకి వివేకా కేసు వెళ్లక ముందు ఎందుకు దర్యాప్తు చేయలేదు..?. వివేకా కూతురు, అల్లుడే చంపారని ఇప్పుడు రకరకాలుగా చెబుతున్న వైసీపీ.. అప్పట్లో ఎందుకు నిరూపించలేకపోయారు..?. వైఎస్ వివేకాను ఆయన కూతురు, అల్లుడే చంపారని సజ్జల సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు." అని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీబీఐ విచారణ కావాలని గతంలో జగన్ ఎందుకు కోరుకున్నారు. ఆ తర్వాత ఎందుకు వెనక్కు వెళ్లారు..? వైఎస్ వివేకా వ్యక్తిత్వాన్ని కించపరిచింది వైసీపీనే. చంద్రబాబు కనుసన్నల్లో వివేకా హత్య జరిగిందని సజ్జల బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు. మేం చెప్పినట్టు సీబీఐ దర్యాప్తు చేస్తుందా..?. ఇది జరుగుతుందా..?. మీడియాను తప్పు దోవ పట్టించింది ఎవరు..?. గుండెపోటు అన్నారా..? లేదా..?. నారాసుర రక్త చరిత్ర అని రాతలు రాశారా..?. లేదా..?. ఇప్పుడు మాట మార్చి కామెంట్లు చేస్తోంది ఎవరు..?. జగన్ అభిమాని కోడికత్తి శీను జైల్లో మగ్గిపోతున్నారు. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు నుంచి వేళ్లన్ని వైఎస్ అవినాష్ రెడ్డి వైపే చూపుతున్నాయి. సజ్జల కామెంట్లు వింటే నవ్వి పోతారు." అని సోమిరెడ్డి మండిపడ్డారు.