Share News

Train accident: విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం.. రెండు బోగీలు బోల్తా.. 9 మంది మృతి

ABN , First Publish Date - 2023-10-29T20:46:57+05:30 IST

విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి రైల్వేజంక్షన్‌ ( Kantakapalli Railway Junction ) దగ్గర రెండు రైళ్లు ఢీ కొన్నాయి. రాయగడ ప్యాసింజర్‌ ( Rayagada Passenger ) ను వెనుక నుంచి పలాస ప్యాసింజర్‌ ( Palasa Passenger ) ఢీకొంది.

Train accident: విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం.. రెండు బోగీలు బోల్తా.. 9 మంది మృతి

విజయనగరం: విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి రైల్వేజంక్షన్‌ ( Kantakapalli Railway Junction ) దగ్గర రెండు రైళ్లు ఢీ కొన్నాయి. రాయగడ ప్యాసింజర్‌ ( Rayagada Passenger ) ను వెనుక నుంచి పలాస ప్యాసింజర్‌ ( Palasa Passenger ) ఢీకొంది. సిగ్నల్‌ కోసం ఆగిన ప్యాసింజర్‌ను పలాస ప్యాసింజర్‌ ఢీకొంది. పట్టాలు తప్పిన విశాఖ- రాయగడ ప్యాసింజర్‌ మూడు బోగీలు చెల్లాచెదురయ్యాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రైల్వే సిబ్బంది తెలిపింది. పట్టాలు క్రాస్‌ చేస్తుండగా ఒక ట్రైన్‌ను మరో రైలు ఢీకొంది. విద్యుత్‌ వైర్లు తెగిపోవడంతో సహాయక చర్యలకు ఆలస్యం అయింది. కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై స్థానిక మంత్రి బొత్స సత్యనారాయణ‌, జిల్లా కలెక్టర్, ఎస్సీని సంఘటన స్థలానికి హుటాహుటిన పంపించింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


చీకటి కారణంగా సహాయ చర్యలకు అంతరాయం: వాల్తేరు డీఆర్‌ఎం సౌరభ్‌

ఈ ప్రమాదానికి సంబంధించి వాల్తేరు డీఆర్‌ఎం సౌరభ్‌ ప్రసాద్‌ మీడియాకు వివరాలు తెలిపారు. విశాఖ- రాయగడ ప్యాసింజర్‌ పట్టాలు తప్పింది. చీకటి కారణంగా సహాయ చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నామని వాల్తేరు డీఆర్‌ఎం తెలిపారు. ప్రమాదంపై హెల్ప్‌ లైన్లను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. క్షతగాత్రులను విశాఖ, విజయనగరం ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు డీఆర్ఎం చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించి అధికారులు హెల్ప్‌ లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేశారు. 81060 53051, 53052, 85000 41670, 41671..0891 2746330, 2744619, 83003 83004 ఈ నెంబర్లలో సమాచారం కోసం సంప్రదించాలని డీఆర్ఎం తెలిపారు.

Updated Date - 2023-10-29T22:57:56+05:30 IST