TTD DFO: కాలినడకన భక్తులు నిర్భయంగా తిరుమలకు రావొచ్చు...
ABN , Publish Date - Dec 30 , 2023 | 10:31 AM
Andhrapradesh: అలిపిరి నడకమార్గంలో ఎక్కడ చిరుత, ఎలుగుబంటి సంచారం లేదని టీటీడీ డీఎఫ్వో శ్రీనివాసు తెలిపారు.
తిరుమల: అలిపిరి నడకమార్గంలో ఎక్కడ చిరుత, ఎలుగుబంటి సంచారం లేదని టీటీడీ డీఎఫ్వో శ్రీనివాసు తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. శేషాచల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో గత 29 రోజుల్లో రెండు సార్లు చిరుత సంచారం కనిపించిందన్నారు. ఒక్కసారి ఎలుగుబంటి సంచారం కనపడిందని అన్నారు. నడకమార్గానికి సమీపంలో ఎక్కడా జంతు సంచారం లేదని స్పష్టం చేశారు. అలిపిరి కాలిబాట మార్గంలోని 7వ మైల్ నుంచి నరసింహ స్వామి ఆలయం వరకు ఫారెస్ట్ సిబ్బంది ప్రత్యేకంగా గస్తీ నిర్వహిస్తున్నారన్నారు. కాలినడకన భక్తులు నిర్భయంగా తిరుమలకు రావొచ్చని టీటీడీ డీఎఫ్వో శ్రీనివాసు స్పష్టం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...