Share News

AP Capital : విశాఖ రాజధాని అంటున్న వేళ జగన్‌ సర్కార్‌కు కేంద్రం గట్టి షాక్!!

ABN , First Publish Date - 2023-10-29T08:36:14+05:30 IST

అవును.. మీరు వింటున్నది నిజమే.. అదిగో ఇదిగో విశాఖకు రాజధాని తరలింపు అంటున్న జగన్ సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది..

AP Capital : విశాఖ రాజధాని అంటున్న వేళ జగన్‌ సర్కార్‌కు కేంద్రం గట్టి షాక్!!

  • విజయవాడకు పాస్‌పోర్టు కార్యాలయం మంజూరు

  • విజయవాడకు ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం

  • పాస్‌పోర్టు కోసం విశాఖ వెళ్లాల్సిన పరిస్థితి లేనట్టే..

  • రాయలసీమ, కోస్తాంధ్రవాసులకు అందుబాటులోకి సరికొత్త సేవలు

  • వచ్చే జనవరి నెల నుంచి సేవలు ప్రారంభం

  • మూడు లక్షల దరఖాస్తుల స్వీకరణ : శివహర్ష, రీజనల్‌ అధికారి

విజయవాడ : రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత విజయవాడ నగరంలో రెండో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం (ఆర్‌పీఓ) త్వరలో ఏర్పాటు కాబోతోంది. ఇప్పటి వరకు ప్రాంతీయ పాస్‌ పోర్టు కార్యాలయం లేకపోవటం వల్ల పాస్‌పోర్టుల ముద్రణ, డిస్పాచ్‌ అంతా విశాఖపట్నంలోనే జరుగుతోంది. కేంద్రం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు విజయవాడకు ఎట్టకేలకు ప్రాంతీయ కార్యాలయం మంజూరైంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నంలో ఉండగా.. కేంద్ర ప్రభుత్వం విజయవాడకు ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని మంజూరు చేసింది. విజయవాడ నూతన రీజనల్‌ పాస్‌పోర్టు ఆఫీసర్‌ కె.శివహర్ష శనివారం విజయవాడలో విలేకరుల సమావేశంలో నూతన ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ విశేషాలను మీడియాతో పంచుకున్నారు. నూతన పాస్‌పోర్టు కార్యాలయం విజయవాడలో ఆసియాలోనే రెండో అతి పెద్ద బస్‌స్టేషన్‌ అయిన పీఎన్‌బీఎస్‌, దేశంలోనే రెండో అతి పెద్ద రైల్వే జంక్షన్‌ లోని రైల్వేస్టేషన్‌కు కూతవేటు దూరంలో బందరు రోడ్డు వెంబడి గవర్నర్‌ పేటలోని ఏజీ ఆఫీసు భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం కేంద్రం పరిధిలో పనిచేస్తున్న సిబ్బందిని విభజించి విజయవాడ కార్యాలయానికి కేటాయించనున్నారు. ఈ ప్రక్రియ అంతా మరి కొద్ది రోజులలో పూర్తి కానుంది.

AP-Map.jpg

నాలుగు లక్షల పాస్‌పోర్టు దరఖాస్తులు స్వీకరించాం..

విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రం పరిధిలోని విజయవాడ, తిరుపతిలలోని ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రాలతో పాటు 13 పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రాల (పీఓపీఎస్‌కే)లలో కలిపి ఇప్పటి వరకు 3 లక్షల పాస్‌పోర్టుల దరఖాస్తులను స్వీకరించటం జరిగింది. రోజుకు సగటున 2 వేల పాస్‌పోర్టు దరఖాస్తులను స్వీకరించటం జరుగుతోంది. కోవిడ్‌ సమయంలో పేరుకుపోయిన అప్లికేషన్లను శరవేగంగా క్లియర్‌ చేయటం జరిగింది. పాస్‌పోర్టు దరఖాస్తులకు సంబంధించి రాష్ట్రంలోనే విజయవాడకు అత్యంత డిమాండ్‌ ఉంది. కొత్త సంవత్సరంలో విజయవాడ పాస్‌పోర్టు కార్యాలయం ఫంక్షన్‌లోకి వస్తుంది.

Updated Date - 2023-10-29T08:37:45+05:30 IST