Gannavaram: వల్లభనేని వంశీ వెన్ను విరవడం తథ్యం: ధూళిపాళ్ల
ABN , First Publish Date - 2023-02-20T20:01:28+05:30 IST
న్నవరం (Gannavaram) టీడీపీ కార్యాలయంపై దాడి దుర్మార్గమని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర (Dhulipalla Narendra) దుయ్యబట్టారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే ఎమ్మెల్యే
అమరావతి: గన్నవరం (Gannavaram) టీడీపీ కార్యాలయంపై దాడి దుర్మార్గమని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర (Dhulipalla Narendra) దుయ్యబట్టారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) వెన్ను విరవడం తథ్యమని హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పేరుతో గెలిచి ఆయనపైనే విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. నెత్తిన రూపాయి పెడితే.. పావలాకు అమ్ముడుపోలేని దద్దమ్మ వంశీ అంటూ విరుచుకుపడ్డారు. ఏపీలో జగన్రెడ్డి రాక్షస పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించిన వారికి కత్తులతో సమాధానం చెప్పడం ఆటవిక పాలన అని దుమ్మెత్తిపోశారు. గూండాలు, రౌడీలు పేట్రేగడానికి జగన్రెడ్డే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంలో కార్లు, ఫర్నీచర్ ధ్వంసం చేయడం వంశీ పశు సంస్కృతికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
గన్నవరం వివాదంలో పోలీసులది ప్రేక్షక పాత్ర
గన్నవరం వివాదంలో పోలీసులు ప్రేక్షక పాత్ర నిర్వహించారని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు విఫలమయ్యారని దుయ్యబట్టారు. పోలీసులు ఓరియంటేషన్ క్లాసులకు హాజరుకావాలన్నారు. రౌడీషీటర్లను కట్టడి చేయలేని దుస్థితిలో పోలీసులున్నారని వర్ల రామయ్య మండిపడ్డారు.
గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి
గన్నవరంలో (Gannavaram) వైసీపీ శ్రేణులు (YCP leaders) రెచ్చిపోయాయి. విధ్వంసం సృష్టించాయి. గన్నవరం టీడీపీ (TDP) కార్యాలయంపై వైసీపీ గుండాలు దాడి చేశారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఆఫీస్ ఆవరణలో ఉన్న వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. కత్తులతో టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించివేశారు. ఓ కారు అద్దాలను ఇటుకలతో బద్దలు కొట్టారు. పార్టీలో కార్యాలయంలో కలియతిరుగుతూ విధ్యంసం సృష్టించారు.