Varla Ramaiah: అవినాష్‌రెడ్డికి సీబీఐ ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తోంది
ABN , First Publish Date - 2023-05-19T21:14:39+05:30 IST
కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై (MP Avinash Reddy) టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) విమర్శలు గుప్పించారు.
అమరావతి: కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై (MP Avinash Reddy) టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) విమర్శలు గుప్పించారు. సీబీఐతో అవినాష్ రెడ్డి దోబూచులాడుతున్నారని, అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారని వర్ల రామయ్య ప్రశ్నించారు. సీబీఐ తన ప్రాబల్యాన్ని, గౌరవాన్ని పోగొట్టుకోవద్దని వర్ల రామయ్య సూచించారు. మన దేశంలో FBIకి ధీటుగా CBI పని చేస్తోందని వర్ల రామయ్య అన్నారు.
కర్నూలు (Kurnool) సిటీలోని విశ్వభారతి ఆస్పత్రిలో కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) తల్లి లక్ష్మమ్మకు చికిత్స అందిస్తున్నారు. కర్నూలు సిటీలోనే ఎంపీ అవినాష్ రెడ్డి, తల్లి లక్ష్మమ్మ ఉన్నారు. చుక్కలూరు నుంచి వెనుదిరిగి హైదరాబాద్ వస్తూ అవినాష్ రెడ్డి కర్నూలులో ఆగిపోయారు. విశ్వభారతి ఆస్పత్రిలో అవినాశ్‌రెడ్డి బీపీ చెకప్ చేయించుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీలక్ష్మి ఇంట్లో ప్రార్థనలు చేస్తుండగా కళ్లు తిరిగి పడిపోయారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన పులివెందులలోని దినేష్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. తల్లిని చూడటానికి సీబీఐ (CBI) విచారణకు డుమ్మా కొట్టి మరీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందులకు బయల్దేరారు. కర్నూలు నుంచి సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు బయలుదేరారు. రేపు ఉదయం కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంపై సీబీఐ అధికారులు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
కవరేజ్‌కు వెళ్లిన ఏబీఎన్ -ఆంధ్రజ్యోతి (ABN -Andhrajyothy) ప్రతినిధులపై ఎంపీ అవినాశ్ రెడ్డి (MP Avinash Reddy) అనుచరులు దాడి చేయడం పాశవిక చర్యగా భావిస్తున్నామని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (JAAP) అధ్యక్షులు రవితేజ, ఉఫాధ్యక్షులు ఆర్‌వి సూర్యనారాయణరెడ్డి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు ఉప్పల లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అవినాష్ రెడ్డి అనుచరులు మీడియాను అడ్డుకోవాలని అనుకోటం ఫ్యాక్షనిజానికి నిదర్శనమని మండిపడ్డారు. అవినాష్ రెడ్డి సీబీఐ ముందు హాజరవుతున్నాడా లేక పారిపోతున్నాడా అన్న విషయం ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత మీడియాపై ఉందన్నారు. అవినాష్ రెడ్డి బాధ్యత గల ప్రజాప్రతినిధిగా తాను సీపీఐ వద్ద హాజరవుతున్నానా లేక పులివెందులకు వెళ్తున్నానా అనే విషయాన్ని ఎందుకు మీడియాకు వెల్లడించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులను జర్నలిస్టుల సంఘాలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించవని స్పష్టం చేశారు.