వెంకట్రామిరెడ్డి బరి తెగింపు.. నేను జగన్ బంటునే..!
ABN , First Publish Date - 2023-03-02T21:55:46+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ (ఏపీజీఈఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి (Venkatrami Reddy) బరితెగించి మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల
విజయవాడ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ (ఏపీజీఈఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి (Venkatrami Reddy) బరితెగించి మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల (YCP MLC candidates) గెలుపునకు ప్రచారంతోపాటు ఆంధ్రజ్యోతి (Andhra Jyothy)పై అక్కసు వెళ్లగక్కారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు ఇస్తామని హామీ ఇచ్చిన.. ముఖ్యమంత్రి అవి ఇవ్వటానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డం వచ్చిందని గుడ్డిగా సమర్ధించారు. ఉద్యోగులకు ఓటు హక్కు ఉంటుంది కాబట్టి డీఏల విడుదలకు, ఎన్నికల కోడ్‌కు లింకు పెట్టిన వెంకట్రామిరెడ్డి.. అదే ఎన్నికల కోడ్ తనకు వర్తించదని.. మీడియా సాక్షిగా.. వైసీపీ అభ్యర్ధులకు మద్దతు పలికారు. తమ సంఘం ఉద్యోగులంతా రాబోయే గ్రాడ్యుయేట్ , టీచర్ల ఎన్నికలలో ఉత్తరాంధ్ర నుంచి సుధాకర్, పశ్చిమ రాయలసీమ (Rayalaseema) నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా వి.రవీంద్రనాద్ రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీగా రామచంద్రారెడ్డి, తూర్పు రాయలసీమలో గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా శ్యాంప్రసాద్ రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీగా చంద్రశేఖరరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.
నేను జగన్ బంటునే!
ఈ ఐదుగురిని తమ ఫెడరేషన్ తరపున గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఓటు హక్కు కలిగిన ఉద్యోగులను బహిరంగంగా మద్దతు పలికి.. వారిని ప్రభావితం చేసేలా వ్యాఖ్యానించటం వెంక ట్రామిరెడ్డి బరితెగింపునకు నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రభుత్వ హయాంలో ఎన్నో పనులు అయ్యాయని, ఎమ్మెల్సీలను కూడా గెలిపించుకుంటే వారి ద్వారా మరిన్ని పనులు చేసుకోవచ్చని ఉద్యోగులకు ఎర వేశారు. తాను సీఎం జగన్ బంటుగా అభివర్ణించుకున్నారు. ప్రభుత్వానికి అధిపతి జగన్ (Jagan) అయినపుడు.. తాను జగన్‌కు బంటును అని చెప్పాడు. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ (Andhra Jyothy- ABN)పై తన అక్కసు వెళ్ళగక్కాడు.