Chandrababu remand: చంద్రబాబుని జైలుకి తరలించడానికి ముందు ఏసీబీ కోర్ట్ కీలక ఆదేశాలు..

ABN , First Publish Date - 2023-09-10T21:46:55+05:30 IST

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ అరెస్ట్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu arrest) రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత కావడంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రత్యేక రూమ్ కేటాయించాలని ఏసీబీ కోర్ట్ ఆదేశించింది. ప్రత్యేక వసతి కల్పించాలని స్పష్టం చేసింది.

Chandrababu remand: చంద్రబాబుని జైలుకి తరలించడానికి ముందు ఏసీబీ కోర్ట్ కీలక ఆదేశాలు..

విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ అరెస్ట్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu arrest) రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత కావడంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రత్యేక రూమ్ కేటాయించాలని ఏసీబీ కోర్ట్ ఆదేశించింది. ప్రత్యేక వసతి కల్పించాలని స్పష్టం చేసింది.

ఈ మేరకు చంద్రబాబు నాయుడు తరపున లాయర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్ట్ నిర్ణయం తీసుకుంది. ఇంటి నుంచి ప్రత్యేక ఆహారం తీసుకొచ్చేందుకు అనుమతివ్వాలని జైలు అధికారులకు తెలిపింది. చంద్రబాబుకు కావాల్సిన మందులు, వైద్యచికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక చంద్రబాబును గృహనిర్బంధం చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది.


స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill development case) మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌ (Chandrababu arrest) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా బ‌ృందం, ప్రభుత్వం తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిల బ‌ృందం సుదీర్ఘ వాదనలు విన్న ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి హిమబిందు తీర్పునిచ్చారు. చంద్రబాబుకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్ట్ తీర్పునిచ్చింది. దీంతో చంద్రబాబును రాజమండి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ప్రస్తుతం ఏసీబీ కోర్ట్ నుంచి సిట్ ఆఫీస్‌కు చంద్రబాబును తరలిస్తున్నారు.

Updated Date - 2023-09-10T21:46:55+05:30 IST