CPM: విశాఖ చేరుకున్న సీపీఎం ప్రజా రక్షణ భేరీ బస్సుయాత్ర
ABN , First Publish Date - 2023-11-04T15:27:23+05:30 IST
సీపీఎం పార్టీ ప్రజా రక్షణ భేరీ బస్సు యాత్ర విశాఖ చేరుకుంది.
విశాఖపట్నం: సీపీఎం పార్టీ ప్రజా రక్షణ భేరీ బస్సు యాత్ర విశాఖ చేరుకుంది. ఈ సందర్భంగా పూర్ణమార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీపీఎం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి మధు (Madhu is the former state secretary of the CPM party) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభలో మధు మాట్లాడుతూ... చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) అరెస్ట్ కుట్రలో భాగమన్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక మోడీ హస్తం ఉందని ఆరోపించారు. చంద్రబాబును అరెస్టు చేయించి, పురందేశ్వరిని తీసుకొచ్చి టీడీపీ స్థానంలో బీజేపీ బలపడాలని చూస్తోందని విమర్శించారు. బీజేపీ కుట్ర కోణాన్ని చంద్రబాబు గ్రహించాలని సూచించారు. బీజేపీ (BJP), కేసీఆర్ Telangana CM KCR), జగన్మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy) కలిసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాల వలన తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ వైఖరిని అర్థం చేసుకొని ఇప్పటికైనా బయటికి రావాలని మధు పేర్కొన్నారు.