Aareti Mahesh Babu: కోడి కత్తి డ్రామాకి బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డే..
ABN , First Publish Date - 2023-04-13T16:31:34+05:30 IST
విశాఖ: ఏపీలో కోడి కత్తి డ్రామా (Kodi Katti Drama)కి బ్రాండ్ అంబాసిడర్ (Brand Ambassador) వైసీపీ అధినేత జగన్ రెడ్డే (Jagan Reddy)నని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్ బాబు (Aareti Mahesh Babu) అన్నారు.
విశాఖ: ఏపీలో కోడి కత్తి డ్రామా (Kodi Katti Drama)కి బ్రాండ్ అంబాసిడర్ (Brand Ambassador) వైసీపీ అధినేత జగన్ రెడ్డే (Jagan Reddy)నని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్ బాబు (Aareti Mahesh Babu) అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్ఐఏ (NIA) అఫిడవిట్ ద్వారా అసలు నిజం తెలిసిపోయిందన్నారు. 2019 ఎన్నికల ముందు వీధినాటకాలాడి ప్రజలను మోసం చేసి గెలిచారని.. ప్రజలకు జగన్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సానుభూతి ఓట్ల కోసం, అడ్డగోలు డ్రామాలాడి టీడీపీ (TDP)పై లేనిపోని అబాండాలు వేసినందుకు వైసీపీ (YCP) గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేయాలని ఆరేటి మహేష్ బాబు డిమాండ్ చేశారు.
కాగా గురువారం కోడికత్తి కేసులో ఏఐఏ కోర్టులో విచారణ జరుగగా.. నిందితుడు తరపున న్యాయవాది అబ్దుస్ సలీం కౌంటర్ దాఖలు చేశారు. గత వాయిదాలో ఈ కేసును కుట్ర కోణంలో విచారించేలా ఆదేశించాలని కోరుతూ సీఎం జగన్ పిటిషన్‌పై సలీం కౌంటర్ దాఖలు చేశారు. అలాగే జాతీయ దర్యాప్తు సంస్థ పీపీ విశాల్ గౌతమ్ కూడా కౌంటర్ దాఖలు చేశారు. రెండు కౌంటర్లలో ప్రత్యక్ష సాక్షి, బాధితుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఇంకా లోతుగా విచారణ చెయ్యాలని వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ కౌంటర్లు వేశారు. సంఘటనలో కుట్ర కోణం ఏదీ లేదని సుదీర్ఘ దర్యాప్తు పిమ్మట తేలిందని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. ఎయిర్‌పోర్టులోని రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్ ప్రసాద్‌కు ఈ సంఘటనతో ఏ సంబంధం లేదని వెల్లడించింది. నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కాదని తేలిందని పేర్కొంది. కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇక దర్యాప్తు అవసరం లేదని తెలిపింది. కోడికత్తి దాడిలో కుట్రకోణం ఉందని లోతైన దర్యాప్తు జరపాలని ఈ నెల 10వ తేదీన జగన్ తరపు న్యాయవాదులు పిటిషన్ వేయగా.. ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని ఎన్‌ఐఏ కోరింది. అయితే వాదనలకు రెండు రోజుల సమయం కావాలని జగన్ తరపు లాయర్ ఇంకొల్లు వెంకటేశ్వర్లు కోర్టుకు కోరారు. దీంతో న్యాయమూర్తి ఈ కేసు విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.