GVL: విశాఖ నుంచి వారణాసికి ప్రత్యేక రైలు నేడు ప్రారంభం..
ABN , First Publish Date - 2023-04-19T12:48:46+05:30 IST
విశాఖ: వైజాగ్ (Vizag) నుంచి వారణాసి (Varanasi)కి ప్రత్యేక రైలు (Special Train) బుధవాం ప్రారంభం కానుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (BJP MP GVL) పేర్కొన్నారు.
విశాఖ: వైజాగ్ (Vizag) నుంచి వారణాసి (Varanasi)కి ప్రత్యేక రైలు (Special Train) బుధవాం ప్రారంభం కానుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (BJP MP GVL) పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్లో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రుల చిరకాల ఆకాంక్ష.. విశాఖ-వారణాసి మధ్య రైలును గంగా పుష్కరాల సందర్భంగా అమల్లోకి తెచ్చామన్నారు. ఇక్కడి నుంచి నేరుగా వారణాసి రైలు కోసం ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశారన్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. ఈ సందర్బంగా జీవీఎల్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
ఈనెల 22వ తేదీ నుంచి మే 3 వరకూ గంగా పుష్కరాలు వున్నాయని, ఈరోజు మధ్యాహ్నం 12-30 గంటలకు ప్రత్యేక రైలు విశాఖ నుంచి బయలు దేరి, గురువారం మధ్యాహ్నం 1 గంటకు దీన దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్‌కు చేరుకుంటుందన్నారు. పుష్కరాల సందర్భంగా విశాఖ- కాశీ మధ్య రైలు 11 పర్యాయాలు నడుస్తుందన్నారు. ఇంటర్ రైల్వే జోనల్ సమస్యలను అదిగమించి రైలును సాధించుకున్నామన్నారు. వేసవి తర్వాత కూడా రెగ్యులర్‌గా నడిచేందుకు కృషి చేస్తామని జీవీఎల్ పేర్కొన్నారు.