Visakha: కిడ్నీ రాకెట్ కేసును ఛేదించిన పోలీసులు..
ABN , First Publish Date - 2023-04-30T11:56:34+05:30 IST
విశాఖ: కిడ్నీ రాకెట్ కేసు (Kidney Racket Case)ను పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను ముఠా సభ్యులు టార్గెట్ చేశారు.
విశాఖ: కిడ్నీ రాకెట్ కేసు (Kidney Racket Case)ను పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను ముఠా సభ్యులు టార్గెట్ చేశారు. ఈ కేసులో ఆపరేషన్ చేసిన డాక్టర్లపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇంకా అరెస్టులు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలను వైజాగ్ సీపీ త్రివిక్రమ్ వర్మ మరికాసేపట్లో మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.
కాగా కిడ్నీ రాకేట్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. శ్రీ తిరుమల ఆసుపత్రి ఎండి పరమేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న డాక్టర్ స్రవంత్ కోసం గాలింపుచర్యలు చేపట్టారు. ఇప్పటికే కామరాజు పోలీసులకు లొంగిపోగా.. ఎలినా పరారీలో ఉన్నారు. బాధితుడు వినయ్ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.
విశాఖలో కిడ్నీల వ్యాపారం గుట్టుగా సాగిపోతోంది. ఆర్థిక అవసరాలున్న వారిని లక్ష్యంగా చేసుకుని పలు ఆస్పత్రులు కిడ్నీల దందా సాగిస్తున్నాయి. నగర పరిధిలోని పలు ఆస్పత్రులు.. ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తులకు అనధికారికంగా కిడ్నీ ఏర్పాటు చేస్తున్నాయి. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు లక్షలాది రూపాయలు ఇచ్చేందుకు ముందుకొస్తుండగా, ఆయా ఆస్పత్రులు నిరుపేదలకు కొంత మొత్తాన్ని చెల్లించి వారి నుంచి కిడ్నీలు తీసుకుని అవసరమైన వారికి అమరుస్తున్నాయి. అయితే, ఆర్థిక లావాదేవీలు బెడిసికొడుతుండడంతో ఈ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో నగర పరిధిలోని శ్రద్ధ ఆస్పత్రిపై ఆరోపణలు రాగా, తాజాగా పెందుర్తిలోని శ్రీతిరుమల ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్ బయటపడింది. కిడ్నీ ఇచ్చిన వ్యక్తికి ముందస్తు ఒప్పందం ప్రకారం ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.