నేను కదలా..
ABN , First Publish Date - 2023-01-01T00:31:32+05:30 IST
ఈ ఫొటోలో కనిపిస్తున్నది పార్వతీపురం మున్సిపాలిటీకి చెందిన చెత్త తరలించే వాహనం.
పార్వతీపురంటౌన్, డిసెంబరు 31 : ఈ ఫొటోలో కనిపిస్తున్నది పార్వతీపురం మున్సిపాలిటీకి చెందిన చెత్త తరలించే వాహనం. దీనిని గత పది నుంచి 15 ఏళ్లుగా వినియోగిస్తున్నారు. అయితే శనివారం మాత్రం పాతబస్టాండ్ సమీపంలోని ప్రధాన రహదారిపై ఉన్నట్టుండి ఇలా నిలిచిపోయింది. కార్మికులు పక్కనెట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 12వ ఆర్థిక సంఘం నిధులు రూ.15 లక్షలతో కొన్నేళ్ల కిందట చెత్త తరలించే వాహనాన్ని మున్సిపల్ అధికారులు కొనుగోలు చేశారు. అయితే ఈ వాహనానికి చాలాసార్లు మరమ్మతులు చేసి వినియోగిస్తున్నారు. చివరకు చెత్త తరలిస్తుండగా సాంకేతిక లోపాలతో నడిరోడ్డులో ఇలా ఆగిపోయింది. దీంతో కార్మికులు, ఈ మర్గంలో రాకపోకలు సాగించే వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. కాలం చెల్లిన వాహనాల నిర్వహణపై ప్రజారోగ్యశాఖ ఇన్‌స్పెక్టర్ మురళీని వివరణ కోరగా ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.
3