Vizianagaram: ‘బాబుతో మేము’ అంటూ సంతకాల సేకరణ..

ABN , First Publish Date - 2023-10-03T15:07:08+05:30 IST

విజయనగరం: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై విజయనగరం జిల్లాలో ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. చంద్రబాబుకు ఉపకారం చేయడం తప్ప.. అపకారం చేయడం రాదంటూ సామాన్యప్రజలు తమ గొంతుకను వినిపిస్తున్నారు.

Vizianagaram: ‘బాబుతో మేము’ అంటూ సంతకాల సేకరణ..

విజయనగరం: టీడీపీ అధినేత (TDP Chief) చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్టు (Arrest)పై విజయనగరం జిల్లాలో ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. చంద్రబాబుకు ఉపకారం చేయడం తప్ప.. అపకారం చేయడం రాదంటూ సామాన్యప్రజలు తమ గొంతుకను వినిపిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసనల ఉద్యమం ఓవైపు హోరెత్తుతుంటే.. మరోవైపు ‘బాబుతో మేము’ అంటూ సంతకాల సేకరణ (Signatures Collections) కార్యక్రమం జోరుగా సాగుతోంది.

చంద్రబాబును కక్ష పూరితంగా జగన్ ప్రభుత్వం (Jagan Govt.) అక్రమంగా నిర్బంధించారని నిరసన ఉద్యమాలు దేశ విదేశాల్లో మారుమోగుతున్నాయి. వివిధ మార్గాలను అనుసరిస్తూ శాంతియుతంగా అనేకమంది ప్రజలు స్వచ్చంధంగా తమ తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే మీసాల గీత (Meesala Geetha) మంగళవారం విజయనగరం కోట దగ్గర ప్రజల అభిప్రాయాలను సంతకాల రూపంలో సేకరించి చంద్రబాబుకు, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ‘బాబుతో నేను’ అనేటటువంటి కార్యక్రమాన్ని గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కోట దగ్గర సంతకాల సేకరణ జరుగుతోంది. కేవలం ఒక గంటలోనే భారీ ఫ్లెక్సీమీద కొన్ని వందలమంది సంతకాలు చేశారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నగరంలోని పోస్టుకార్డు ఉద్యమం నిర్వహిస్తున్నారు.

Updated Date - 2023-10-03T15:07:08+05:30 IST