Yuvagalam: విజనర్‌ కావాలా.. ప్రిజనర్‌ కావాలా!?: నారా లోకేష్‌

ABN , First Publish Date - 2023-06-15T20:43:12+05:30 IST

చంద్రబాబు దార్శినికుడు. ఆయన పాలనలో కియా మేడిన్‌ ఆంధ్రప్రదేశ్‌, సెల్‌ఫోన్‌ మేడిన్‌ ఆంధ్రప్రదేశ్‌, టీపీ మేడిన్‌ ఆంధ్రప్రదేశ్‌గా ఉంటే ఈ ప్రిజనరీ (ఖైదీ) పాలనలో గంజాయి మేడిన్‌

Yuvagalam: విజనర్‌ కావాలా.. ప్రిజనర్‌ కావాలా!?: నారా లోకేష్‌

నెల్లూరు: గురువారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం మండలం బొమ్మవరం విడిది కేంద్రంలో యువతతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. జగన్‌ పాలనలో అన్ని వర్గాలు నాశనం అయ్యాయని, అన్నింటికన్నా యువత తీవ్రంగా నష్టపోయిందని లోకేష్‌ అన్నారు. ఇది రాష్ట్ర భవిష్యత్తును నిర్ధేశించుకునే సమయం వచ్చింది, రానున్న ఎన్నికల్లో మన రాష్ట్రానికి దార్శినికుడైన చంద్రబాబు (Chandrababu) కావాలో ఫ్యాక్షన్‌ నాయకుడు కావాలో ఆలోచించుకోవాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని యువత సరైన నిర్ణయం తీసుకోవాలని లోకేష్‌ పిలుపునిచ్చారు.

‘‘చంద్రబాబు దార్శినికుడు. ఆయన పాలనలో కియా మేడిన్‌ ఆంధ్రప్రదేశ్‌, సెల్‌ఫోన్‌ మేడిన్‌ ఆంధ్రప్రదేశ్‌, టీడీపీ మేడిన్‌ ఆంధ్రప్రదేశ్‌గా ఉంటే ఈ ప్రిజనరీ (ఖైదీ) పాలనలో గంజాయి మేడిన్‌ ఆంద్రప్రదేశ్‌, జే బ్రాండ్‌ లిక్కర్‌ మేడిన్‌ ఆంధ్రప్రదేశ్‌, ఇసుక మాఫియా మేడిన్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. విజనరీ చంద్రబాబు పాలనలో హెచ్‌సీఎల్‌, క్యాంజియన్ట్‌, కియా, సీసీఎల్‌, డిక్షన్‌ వంటి కంపెనీలు వచ్చాయి. ప్రిజనరీ పాలనలో ఫాక్స్‌కాన్‌, రిలయన్స్‌, అమరారాజ వంటి కంపెనీలు దండం పెట్టి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. జగన్‌ది ట్రూ ఫ్యాషన్‌ మెంటాలిటీ. అందుకే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మంచి పని చేయకుండా ప్రజా వేదిక కూల్చారు. పరిశ్రమలు రాకూడదు, ఆయన పెట్టే తిండి, క్వార్టర్‌పైనే ప్రజలు బతకాలని ఆలోచిస్తాడు. కానీ విజనరీ చంద్రబాబు మాత్రం అందరికీ ఉద్యోగాలు రావాలి. అందరూ ఎదగాలి అని ఆలోచిస్తాడు.. ఇప్పుడు చెప్పండి రాష్ట్ర భవిష్యత్తుకు ఎవరు కావాలి? విజనర్‌ చంద్రబాబు కావాలా? ఫ్యాక్షన్‌ ముఠా నాయకుడైన జగన్‌ (Jagan) కావాలా? ఈ రాష్ట్రానికి ఎవరు అవసరమో యువత ఆలోచించుకోవాలి’’ అని టీడీపీ నేత నారా లోకేష్‌ (Nara Lokesh) సూచించారు.

Updated Date - 2023-06-15T20:53:01+05:30 IST