అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్నారని ఇద్దరు యువకులపై..

ABN , First Publish Date - 2023-09-01T10:59:06+05:30 IST

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం సత్తెన్నగూడెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న యువకులపై దాడిని ఖండిస్తూ గ్రామస్తులు రోడ్డుపై టెంటు వేసి ధర్నా చేపట్టారు. దీంతో పరిస్థితి ఉధృతంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్నారని ఇద్దరు యువకులపై..

ఏలూరు : ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం సత్తెన్నగూడెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న యువకులపై దాడిని ఖండిస్తూ గ్రామస్తులు రోడ్డుపై టెంటు వేసి ధర్నా చేపట్టారు. దీంతో పరిస్థితి ఉధృతంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సత్తెన్నగూడెం గ్రామానికి చెందిన కిషోర్, రమేష్ లు రాత్రి ఇంటికి వెళుతున్న సమయంలో చెరువు వద్ద మట్టి తవ్వకాలు జరుగుతున్నట్టు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి అనుమతులు లేకుండా ఎందుకు మట్టి తవ్వుతున్నారని ప్రశ్నించగా.. అక్కడే ఉన్న చిన వెంకన్న ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ మానుకొండ సుబ్బారావు, అతని అనుచరులు కలిసి వారిపై విచక్షణారహితంగా దాడి చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆ దాడిలో గాయపడిన కిషోర్‌ను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మట్టి అక్రమ తవ్వకాలు అడ్డుకున్న యువకులపై దాడి చేసిన చిన వెంకన్న ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ సుబ్బారావు, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Updated Date - 2023-09-01T10:59:06+05:30 IST