అక్టోబర్ 24 నుంచి ద్వారకా తిరుమలలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2023-09-29T08:55:32+05:30 IST
వచ్చే నెల 24 నుంచి 29 వరకు ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 24న స్వామి, అమ్మవార్లను పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్లుగా అలంకరించనున్నారు.
ఏలూరు : వచ్చే నెల 24 నుంచి 29 వరకు ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 24న స్వామి, అమ్మవార్లను పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్లుగా అలంకరించనున్నారు. 25న ధ్వజారోహణ, 26న స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం, 27న రథోత్సవం, 28న చక్రస్నానం, ధ్వజఅవరోహణ, మధ్యాహ్నం 1:00 గం నుంచి చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేయనున్నారు. 29న వసంతోత్సవం, రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి ఆలయంలో జరిగే నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేయనున్నారు. ఈ క్రమంలోనే ద్వారకా తిరుమల చిన వెంకన్న నిత్యాన్నదాన కనీస శాశ్వత విరాళమును పెంచారు. రూ.2116 నుంచి రూ.5116 కి దేవస్థానం పెంచింది.